logo

కళారాధన,దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు.

నంద్యాల (AIMA MEDIA): నూతన సంవత్సరాది పురస్కరించుకుని గురువారం స్థానిక కళారాధన, దివ్యాంగుల సంక్షేమ సంఘం, ఐఎంఏ, లయన్స్ క్లబ్, క్రీడా సమాఖ్య కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యాలయానికి వచ్చిన వారికి మిఠాయిలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, కళారాధన వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు, శ్రీ సుంకుల పరమేశ్వరి దేవస్థానం చైర్మన్, వీధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు,వివిధ క్రీడా సంఘాలకు అధ్యక్షులు గా సేవలందిస్తున్న డాక్టర్ రవి కృష్ణ ఈ సందర్భంగా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2026వ సంవత్సరంలో ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. దివ్యాంగులకు చేయూతనివ్వమని, క్రీడలను ప్రోత్సహించమని, కళ లను ఆదరించమని కోరారు. వైద్యులు,ఉపాధ్యాయులు, పాత్రికేయులు,దివ్యాంగులు,
క్రీడాకారులు,కళాకారులు,వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు, ఐఎంఏ, లయన్స్ క్లబ్, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం,వీధి వ్యాపారస్తుల సంఘం,టీవీ టెక్నీషియన్స్ సంఘం,వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు డాక్టర్ రవి కృష్ణను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

0
212 views