logo

వైసీపీ కార్యాలయం వద్ద ఘనంగా నూతన సంవత్సరం వేడుకలు

రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలోని రాజాం పట్టణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ తలే రాజేష్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలకు నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ తలే రాజేష్ గారికి నియోజకవర్గ పరిధిలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని శాలువాలు వేసి, పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం డాక్టర్ తలే రాజేష్ తో పాటు ముఖ్య నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి భారీ కేక్‌లను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. నూతన సంవత్సరం ప్రజలందరికీ శుభకరంగా ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపాలిటీ కన్వీనర్, మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా మరియు నియోజకవర్గ అనుబంధ కమిటీల అధ్యక్షులు, గ్రామ స్థాయి సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ ముఖ్య నాయకులు, సోషల్ మీడియా విభాగ సభ్యులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

11
1254 views