విద్యుత్ శాఖలో 'బిల్ స్టాప్' మాఫియా: మీటర్ల వెనుక భారీ కుంభకోణం!
విజయనగరం జిల్లా విద్యుత్ శాఖలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. 'బిల్ స్టాప్' (డమ్మీ) మీటర్ల పేరుతో ఓ ఉద్యోగి ఒక్కో మీటరును రూ. 10,00-రూ. 15,000 విక్రయిస్తూ సంస్థ ఆదాయానికి గండి కొడుతున్నాడు. ఈ మీటర్లు అమర్చుకుంటే కరెంట్ వాడకం ఎంత ఉన్నా బిల్లు '0' వస్తుంది. అధికారుల అండదండలతోనే ఈ అక్రమ వ్యాపారం సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఈఈ త్రినాథరావు బుధవారం తెలిపారు.