logo

​నయా జోష్: విజయనగరంలో అంబరాన్నంటిన 'న్యూ ఇయర్' సంబరాలు!


విజయనగరం ఉమ్మడి జిల్లాలో న్యూఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. డిసెంబర్ 31st నైట్ బాణసంచా కాల్చుతూ.. పాటలకు డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. మహిళలు తమ ఇంటిముందు రంగురంగుల ముగ్గులు వేసి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు.
యువత గంటస్తంభం వంటి ముఖ్య కూడళ్లలో గుంపులుగా చేరి విషెష్ చెప్పుకుంటూ సందడిగా గడిపారు. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు.

0
244 views