logo

జిల్లా ప్రజలకు, పోలీసు యంత్రాంగానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ ఏఆర్ దామోదర్, ఐపిఎస్

నూతన సంవత్సరం - 2026 పురస్కరించుకొని జిల్లా ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు, మినిస్టిరియల్ ఉద్యోగులకు, పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ - గత సంవత్సరంలో జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో అంకితభావంతో పని చేసినందుకు అభినందనలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రతి ఒక్కరూ తమ విధులను నిబద్ధతతో నిర్వహించారని ప్రశంసించారు. రాబోయే నూతన సంవత్సరంలో కూడా పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచుతూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా అధికారులు మరియు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
ప్రజలు పోలీసు శాఖకు సహకరించి, సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని, నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని, ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకూడదని కోరారు. అలాగే, 24 గంటలు ప్రజాసేవలో నిమగ్నమై విధులు నిర్వహిస్తున్న జిల్లా పోలీసు అధికారుల మరియు సిబ్బంది సేవలు అభినందనీయమని పేర్కొంటూ, వారి కుటుంబాలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం, విజయాలు కలగాలని ఎ.ఆర్.దామోదర్ ఆకాంక్షించారు.

4
169 views