రాయచోటి జిల్లా కేంద్రాన్ని రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాయచోటి ప్రాంత ప్రజలు ఉవ్వెత్తున ఎగసిపడ్డారు.
రాయచోటి జిల్లా కేంద్రం మార్పుపై.. అన్నమయ్య జిల్లా విచ్చిన్నం చేయడం.. రాజకీయ కుట్రలపై భగ్గుమన్న ప్రజలు...
ఉద్యమ జ్వాలలతో దద్దరిల్లిన రాయచోటి – ఉప్పెనలా తరలివచ్చిన జనసంద్రం..
వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతియుత ర్యాలీకి వేలాదిగా తరలివచ్చిన ప్రజలు..విశేష స్పందన..
ఆత్మఘోష ర్యాలీ భారీ సక్సెస్...
రాయచోటి జిల్లా కేంద్రాన్ని రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాయచోటి ప్రాంత ప్రజలు ఉవ్వెత్తున ఎగసిపడ్డారు. జిల్లా కేంద్రాన్ని కాపాడుకోవాలన్న సంకల్పంతో వేలాదిగా ప్రజలు రోడ్లపైకి వచ్చి, రాయచోటిని ఉద్యమ కేంద్రముగా మార్చేశారు. ప్రజాగర్జనతో పట్టణం మారుమోగింది.
జిల్లా కేంద్ర తొలగింపు నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతియుత ర్యాలీ సంచలనం సృష్టించింది. రాయచోటి పట్టణం ఎస్.ఎన్. కాలనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి చెక్‌పోస్ట్ శివాలయం, బంగ్లా వరకు సాగిన ఈ భారీ ర్యాలీలో జనసంద్రం వెల్లువెత్తింది.
ఈ ఉద్యమానికి స్వచ్ఛందంగా ప్రజలు తరలిరావడం గమనార్హం. యువత, విద్యార్థులు, మేధావులు, విద్యావంతులు, వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు, వైఎస్ఆర్ సీపీ శ్రేణులు భుజాలు కలిపి జిల్లా కేంద్ర రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు.
రాయచోటి జిల్లా కేంద్రం మా హక్కు – దాన్ని లాక్కోనివ్వం” అంటూ నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. ప్రభుత్వ నిర్ణయం ప్రజా ఆకాంక్షలకు విరుద్ధమని, వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నిరసనకారులు ఘాటుగా డిమాండ్ చేశారు.
రాయచోటి జిల్లా కేంద్రాన్ని తొలగించాలన్న ప్రయత్నం ప్రజా వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తూ, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ప్రజల సంకల్ప బలాన్ని తక్కువ అంచనా వేస్తే పరిణామాలు తప్పవని ప్రజాగర్జన స్పష్టంగా హెచ్చరించింది.
నినాదాలతో దద్దరిల్లిన రాయచోటి...
రాయచోటి ముద్దు...మదనపల్లె వద్దు, వెనుకబడిన ప్రాంతంగా జిల్లా కేంద్రంగా ఏర్పడినరాయచోటికి అన్యాయం చేయొద్దు, రాయచోటి జిల్లా మన హక్కు, జిల్లా కేంద్రంగా రాయచోటి రద్దు నిర్ణయం.. ప్రజలకు ద్రోహం,రాయచోటిని జిల్లా కేంద్రంగా తీసేస్తే ఊరుకోం… ఊరుకోం!,కావాలి..కావాలి... జిల్లా కేంద్రంగా రాయచోటి కావాలి,చరిత్రలో లేని అన్యాయం.. రాయచోటి పై ప్రయోగం,క్యాబినెట్ నిర్ణయం మారాలి..జిల్లా కేంద్రంగా రాయచోటి నిలవాలి,చంద్రబాబు గారు ఎన్నికల హామీని నెరవేర్చండి.. రాయచోటిని కొనసాగిస్తామన్న మాట నిలబెట్టుకోండి, రాయచోటి గొంతు నొక్కవద్దు..ప్రజల ఓపికను పరీక్షించొద్దు, ఈ నినాదాలతో కలిగిన ప్లే కార్డులను ర్యాలీలో ప్రజలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ హిందూపురం పరిశీలకులు రమేష్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి దేవనాధ రెడ్డి, ఎస్ ఈ సి సభ్యులు ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, అఖిల భారత పంచాయితీ పరిషత్ సేక్రటరీ చిదంబర్ రెడ్డి, పార్లమెంటరీ రాష్ట్ర కార్యదర్సులు గొర్ల ఉపేంద్రారెడ్డి, పోలు సుబారెడ్డి, లక్కిరెడ్డిపల్లె ఎంపిపి మద్దిరేవుల సుధర్శన్ రెడ్డి, రామాపురం జెడ్ పి టి సి మాసన వెంకట రమణ,జిల్లా సాధన సమితి గౌరవాధ్యక్షుడు డా బయారెడ్డి, అధ్యక్షుడు నాగిరెడ్డి, సభ్యులు వి ఆర్ రెడ్డి, మండల కన్వీనర్లు మిట్టపల్లె యదుభూషన్ రెడ్డి (గాలివీడు), గోవర్ధన్ రెడ్డి (చిన్నమండెం), నవాజ్ (మున్సిపాలిటీ),ఉదయ్ కుమార్ రెడ్డి (సంబేపల్లె), గడికోట జనార్దన్ రెడ్డి (రామాపురం) , మాజీ ఎంపిపి లు అంపాబత్తిన రెడ్డెయ్య , మోటకట్ల బరుగు రెడ్డెన్న, రాయచోటి మున్సిపల్ వైస్ చైర్మన్ లు దశరథ రామిరెడ్డి, ఫయాజుర్ రెహమాన్, రాష్ట్ర కార్యదర్శి బసిరెడ్డి సిద్దారెడ్డి, వైఎస్ఆర్ సిపి మైనారిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి బేపారి మహమ్మద్ ఖాన్, బిసి సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ భాస్కర్, ట్రైకార్ మాజీ చైర్మన్ గుండా సురేంద్ర, సీనియర్ నాయకులు ఎస్ కె ఖాదర్ మోహిద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల నాగభూషన్ రెడ్డి, మాజీ వైస్ ఎంపిపి రమేష్ రెడ్డి, ఎస్ సి సెల్ రాష్ట్ర కార్యదర్శి చుక్కా అంజనప్ప, జిల్లా విద్యార్థి సంఘ అధ్యక్షుడు జంగంరెడ్డి కిషోర్ దాస్, కౌన్సిలర్లు, ఎంపిటిసి లు, సర్పంచులు, నాయకులు, కార్యకర్త లు పెద్దఎత్తున పాల్గొన్నారు.