
వర్కింగ్ జర్నలిస్టులందరికీ నూతన సంవత్సర కేకుల పంపిణీ కార్యక్రమం... బొమ్మన ఫౌండేషన్ మరియు ఏపీ ఎంఎఫ్*
*వర్కింగ్ జర్నలిస్టులందరికీ నూతన సంవత్సర కేకుల పంపిణీ కార్యక్రమం... బొమ్మన ఫౌండేషన్ మరియు ఏపీ ఎంఎఫ్*
ఏపీ ఎంఎఫ్ మరియు బొమ్మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు నూతన సంవత్సర కేకుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, బిజెపి యువమోర్చా జిల్లా అధ్యక్షుడు బొమ్మన విజయ్ ఆధ్వర్యంలో కడపలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ కేకులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఉప్పు శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులు రామచంద్ర, సుధీర్, కిషోర్, శర్మ, నరసింహ, చంద్ర తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బొమ్మన విజయ్ మాట్లాడుతూ,ప్రజలకు నిజాలను చేరవేసే బాధ్యతాయుతమైన వృత్తిలో జర్నలిస్టుల పాత్ర ఎనలేనిదని అన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వార్తలను కవరేజ్ చేసే జర్నలిస్టులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కేకులు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని చెప్పారు.జర్నలిస్టుల సమస్యలు, అవసరాల విషయంలో ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, వారి సేవలకు తాము ఎల్లప్పుడూ గౌరవం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.