
కడప నగర పాలక సంస్థ.
*కడప నగర పాలక సంస్థ...*
*ఈరోజు కడప మేయర్ గారి ఛాంబర్ నందు టౌన్ ప్లానింగ్ అధికారులతో కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ గారు సమీక్షా సమావేశం..*
*గతం వారం క్రిందట BPS & LRS ల పై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. దానిమీద పురోగతిపై ఎన్ని బీపీఎస్ అప్లికేషన్లు వచ్చాయి, ఎన్ని గుర్తించారు,ఎన్ని వాటికీ మార్కింగ్ ఇచ్చారు, ఎంతమందికి అవగాహన కల్పించారు అని CP శైలజా గారు, ACP లు ముని లక్ష్మీ & మునిరత్నం గార్లతో మేయర్ గారు చర్చించారు...*
*అదేవిధంగా BPS & LRS కార్యక్రమాన్ని విస్తృతంగా ముందుకు తీసుకువెళ్లి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మేయర్ గారు అధికారులను ఆదేశించారు...*
*ఇటీవల న్యూస్ పేపర్ లలో టౌన్ ప్లానింగ్ విభాగం మీద అనేక వార్తలు రావడం జరిగినందున వాటిని సరిచేసుకోవాలని అనథరైజెడ్ కన్స్ట్రక్షన్స్ నిర్మూలించాలని వార్డ్ టౌన్ ప్లానింగ్ అధికారులకు సరైన మార్గదర్శకాలను ఇవ్వాలని ఆదేశించారు...*
*ఈ సమావేశం లో డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు మరియు కార్పొరేటర్లు మక్బూల్ భాషా , బాలస్వామి రెడ్డి, షఫీ అజ్మతుల్లా గార్లు, అధికారులు పాల్గొన్నారు...*
*కడప నగర మేయర్ గా ఎన్నికైన పాక సురేష్ కుమార్ గారిని నగర పాలక సంస్థ రిటైర్డ్ ATO (Assistant Technical Officer ) రామాంజనేయులు గారు పుష్పగుచ్ఛం తో మర్యాద పూర్వకంగా కలిశారు...*