హిందూపురం అంబేద్కర్ సర్కిల్ నందు ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు నిరసన
హిందూపురం అంబేద్కర్ సర్కిల్ నందు ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు నిరసన
విశాఖపట్నంలో ఏఐఎస్ఎఫ్, ఏ ఐ వై ఎఫ్ నాయకుల పైన ఓపెన్ చేసినా రౌడీ షీట్ ను వెనక్కి తీసుకోవాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నరసింహమూర్తి డిమాండ్
ఈ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై పోరాడుతున్నటువంటి ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం రౌడీ షీట్ ఓపెన్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులు ఉద్యమాలు చేపడుతున్నారన్న ఉద్దేశంతో నిన్నటి రోజున విశాఖపట్నంలో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకుల పై అక్రమంగా రౌడీ సీతను ఓపెన్ చేస్తున్నారు మీరు ఎన్నో కేసులు పెట్టిన ఎంతమంది మీద రౌడీషీటర్ ఓపెన్ చేసిన ఏఐఎస్ఎఫ్ నాయకత్వం వెనకడుగు వేసేదే లేదు అని అన్నారు