logo

ఐసిడిఎస్ హైయర్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ



మెంటాడ:ఐసిడిఎస్ హైయర్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు సాలూరు పట్టణంలోని ఆమె స్వగృహం వద్ద బుధవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఐసిడిఎస్ కార్యక్రమాల విజయవంతమైన అమలులో వాహన డ్రైవర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. స్త్రీలు, చిన్నారులు, గిరిజన సంక్షేమానికి సంబంధించిన పథకాలు క్షేత్రస్థాయికి చేరడంలో డ్రైవర్ల సేవలు అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో కూడా శాఖలతో సమన్వయంగా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూనియన్ నాయకులు గదుల సత్యనారాయణ, వై. రాంబాబు, అప్పలనాయుడు, గణపతి తదితరులు పాల్గొని మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అసోసియేషన్ సభ్యులు, డ్రైవర్లు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

0
490 views