logo

రోలుగుంటలో వ్యాసరచన పోటీలు మాదకద్రవ్యాల నివారణలో విద్యార్థుల పాత్ర

అనకాపల్లి జిల్లా రోలుగుంట . స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమాజంలో గంజాయి, మాదకద్రవ్యాల నివారణలో విద్యార్థుల పాత్ర అనే అంశంపై మంగళవారం వ్యాసరచన పోటీలు నిర్వహించబడినాయి. ఈ కార్యక్రమాన్ని రోలుగుంట పోలీస్ స్టేషన్ ఎస్సై జి. రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీలు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టి.వి. శేషగిరిరావు, అధ్యాపకురాలు ఈ. విజయరాణి పర్యవేక్షణలో జరిగాయి.ఇంగ్లీష్ విభాగంలో ఎం. శ్రీవాణి, ఎం. కార్తీక్‌లు ప్రతిభ కనబరచి ప్రథమ స్థానం అందుకోగా, తెలుగు విభాగంలో ఎస్. మోనో ప్రథమ బహుమతిని సాధించారు. బుధవారం విజేతలకు పాఠశాల ప్రాంగణంలో ఎస్సై జి. రామకృష్ణ చేతులమీదుగా బహుమతులు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా ఎస్సై రామకృష్ణ మాట్లాడుతూ — “విద్యార్థులే భవిష్యత్తు పౌరులు. మాదకద్రవ్యాల వినియోగాన్ని నిరోధించడంలో మీరు కీలక పాత్ర పోషించాలి. ఎవరైనా గంజాయి లేదా మత్తు ద్రవ్యాల వాడకం చేస్తూ కనపడినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. సమాజంలో అవగాహన పెంచడం ద్వారా డ్రగ్స్ రహిత వాతావరణాన్ని ఏర్పరచవచ్చు” అని అన్నారు.అలాగే ప్రధానోపాధ్యాయుడు టి.వి. శేషగిరిరావు మాట్లాడుతూ — “మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులు అవగాహనతో ముందడుగు వేయడం సమాజానికి మేలు చేస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయి” అన్నారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా సాగింది.

8
48 views