logo

నెలిపర్తి లో లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కూన రవికుమార్

AIMA న్యూస్ శ్రీకాకుళం :
*నెలిపర్తి గ్రామంలో పండగ వాతావరణం లా* *జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ* *కార్యక్రమం*

✅ఆముదాలవలస నియోజకవర్గం, ఆముదాలవలస మండలం నెలిపర్తి గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

✅ఈ సందర్భంగా అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తదితర లబ్ధిదారులకు పెన్షన్‌ను స్వయంగా వారి ఇంటి వద్దకే వెళ్ళి పంపిణీ చేశారు. పెన్షన్ అందుకున్న లబ్ధిదారులను శాసనసభ్యులు ఆప్యాయంగా పలకరించి వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకున్నారు.

✅ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పేదల జీవితాల్లో ఆర్థిక భద్రతను కల్పించే కీలక పథకం అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
పేదలు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని, గ్రామస్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు తాడిబోయిన చంద్ర శేఖర్ యాదవ్ గారు,స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్థులు, అధికారులు పాల్గొన్నారు. నెలిపర్తి గ్రామంలో ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

0
0 views