logo

చారిత్రిక రాజమండ్రి పేరును " రాజమంద్రి " గా మార్చి మా ఆత్మగౌరవాన్ని కాపాడండి ..

చారిత్రిక రాజమండ్రి పేరును " రాజమంద్రి " గా మార్చి మా ఆత్మగౌరవాన్ని కాపాడండి ..

2027 - రాజమండ్రి పుష్కరాల సందర్బంగా పేపర్ మిల్లు ను ముందుగా మూసి వేయండి ..
***********************
మేడా శ్రీనివాస్, ప్రభుత్వానికి నివేదిక ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..
************************
అసాంఘిక రాజ రాజ నరేంద్రుని అభిలాష మేరకు ఏర్పడిన
" రాజమహేంద్రవరం " పేరును " రాజమంద్రి " గా పేరు మార్చి అధికారిక ప్రకటన చేసి ప్రస్తుత రాజమండ్రి ప్రజల ఆత్మగౌరవానికి బాసటగా నిలవాలని రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్పిసి వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు .

మీడియా సమావేశంలో మేడా శ్రీనివాస్ మాట్లాడుతు ది 23-7-2027 తేదిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజమండ్రికి పుష్కరాలు నిర్వహించుటకు ముహూర్తం ఖరారు చేసారు . ఈ దఫా రాజమండ్రి పుష్కరాలు ప్రయాగ్ రాజ్ లో జరిగిన కుంభమేళా తరహాలో ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల మంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వ అంచనాలు చెపుతున్నాయాన్నారు . 2015 రాజమండ్రి పుష్కరాల్లో జరిగిన పొరపాట్లు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లుతో పాటుగా దైవ భక్తి , అనుభవం గల అధికారులను రాజమండ్రి పుష్కరాలకు నియమించాలన్నారు . ప్రపంచంలోనే అత్యంత
ప్రాముఖ్యత గల రాజమండ్రి పుష్కరాలకు ప్రభుత్వం ఆరోగ్య భద్రతా ఏర్పాట్లు పక్కాగా నిర్వహించాలన్నారు . రాజమండ్రి ప్రజల అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లును పుష్కరాలకు 3 నెలల ముందస్తుగానే మిల్లును మూసేయాలన్నారు . కోట్లాది మంది భక్తులు గోదావరి స్నానాలు ఆచరిస్తారని , మిల్లు ద్వారా విడుదలయ్యే అతి ప్రమాదకర రాసాయనాలు గాలి , నీటి లోను కలుషితమయ్యి భక్తులు ఆరోగ్యాలు క్షేణించే ప్రమాదాలు సంభవిస్తాయని, వాయు కాలుష్యం కూడా ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తాయాన్నారు . భక్తులు రద్ది పెరిగే కొద్ది ప్రయాగ్ రాజ్ , కేరళ, కర్ణాటక లో కొత్త కొత్త వైరస్ లు అక్కడ ప్రజలను భయపెట్టాయని , వైధ్యులు సైతం చేతులెత్తెసి ప్రాణ నష్టానికి కారణం అయ్యారన్నారు . అలాటి పరిస్థితులు రాజమండ్రి పుష్కరాల్లో తేలెత్తకుండా ఉండాలంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పేపర్ మిల్లును ముందుగా మూసి వేసి ప్రజల ఆరోగ్యాలకు ప్రభుత్వం అండగా నిలవాలని , భక్తులు రద్దిని ఉగ్రమూకలు గమనించి అవాంచనీయ విద్రోహ ఘటనలకు కుట్రలు చేసే ప్రమాదం వుందని గమనించాలన్నారు . నిఘా వ్యవస్థలను పూర్తి స్థాయిలో పటిష్ట పరచలన్నారు .

2015 సం.రం. లో జరిగిన రాజమండ్రి పుష్కరాల సందర్బంగా అప్పటి ముఖ్యమంత్రి వర్యులు ఆయన తమరు (శ్రీ నారా చంద్రబాబు నాయుడు) అప్పటి అధికారుల సమాచారం మేరకు రాజమండ్రి గా ఉన్నటువంటి పేరును "రాజమహేంద్రవరం" గా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ వేదికగా పేరు మార్చి ప్రకటన చేసారు . నిజానికి ప్రస్తుత రాజమండ్రి అతి పురాతనమైన సాహితీ నగరంగా పేరుంది . కళలకు , దార్మిక సేవలకు , దేశ భక్తి గల యుద్ద నైపుణ్యాలకు ఎంతగానో పేరు గాంచిన నగరం . యజ్ఞ - యాగలకు పుట్టినిల్లు రాజమండ్రి అని గ్రహించాలి . నన్నయ్య, తిక్కన వంటి ఎందరో కవులు సంచరించిన నేల రాజమండ్రి . రాజ రాజ నరేంద్రుని కాలం కన్నా ముందు 2000 సంవత్సరాల పై భడిన పురాతన గొప్ప చరిత్ర ప్రస్తుత రాజమండ్రి దని , రాజమండ్రి నగరాన్ని ఎవరో ఈనాం గానో , బహుమానం గానో , దయ తోనో ఇచ్చిన నగరం కాదని ప్రభుత్వం పెద్దలు భావించాలి . రాజమండ్రి పేరుకు చివర "వరం" అని చేర్చి రాజమహేంద్రవరం అంటు రాజమండ్రి ప్రజల ఆత్మగౌరవాన్ని గాయపరచటం అన్యాయమైన చర్య . రాజ రాజ నరేంద్రుని అభిలాష మేరకు ఏర్పడిన రాజమహేంద్రవరం కు రాజమండ్రి పురాతన చరిత్రకు ఎట్టి సంబంధం లేదు . కూతురుతో సమానం అయిన కన్న కొడుకు భార్య చిత్రాంగి పై చెడు దృషితో మనసు పారేసుకుని సొంత బిడ్డ సారంగుడును హతమార్చిన నీచ చరిత్ర రాజ రాజ నరేంద్రుడు దని , అతని కాలం నాటి కన్నా ముందు కాలం రాజమహేంద్రవరం ను క్షత్రియులు , రాజులు, నవాబులు, మోఘల్లు, నైజాం , డచ్చి వారు , ఆంగ్లేయులు వరకు పాలించిన
ఆ నాటి "రాజమంద్రి" " "రాజమందిర్" అను నామాలతో ఎంతో ఘనంగా ప్రసిద్ధి గల నగరం రాజమండ్రి అని అధికారిక వర్గాలు గుర్తించాలి .

ప్రభుత్వానికి కొన్ని సూచనలతో ఒక నివేదిక ను పంపించటం జరిగింది ..
***********************
(1) 2027 - రాజమండ్రి పుష్కరాలకు కోట్లాది మంది భక్తుల రద్దిని గమనించి జల వాయు కాలుష్యాల నుండి ప్రజల ఆరోగ్య భద్రతా దృష్ట్యా ఏపి పేపర్ మిల్లును 3 నెలలు ముందుగా నిలిపి వేయుటకు తక్షణ ఆదేశాలు జారి చేయాలి .
(2) పటిష్టమైన స్నాన ఘట్టాల నిర్మాణానికి నిపుణుల బృందంతో ప్రణాళికలు సిద్దం చేయాలి .
(3)పుష్కర భద్రతా ఏర్పాట్లు, ఇతర అభివృద్ధికి సంబందించి స్థానికులు తోను , ఇతర రాజకీయ పార్టి లతోను ఒక అధికారిక అఖిలపక్ష కమిటీని నియమించాలి .
(4) 2027- రాజమండ్రి పుష్కరాలకు సంబందించి అనుభవజ్నులు , దైవభక్తి గల ఉన్నత అధికారులను / అధికారులను నియమించగలరు .
(5) 2027- రాజమండ్రి పుష్కరాలకు సంబందించి ట్రాఫిక్ క్రమ బద్దికరణకు , వాహన పార్కింగ్ ఏర్పాట్ల కోసం 6 నెలల ముందు నుండి పక్కా ఏర్పాట్లను సిద్దం చేయగలరు .
(6) మెరుగైన ప్రత్యేక పారిశుధ్య ఏర్పాట్లను బాధ్యతతో నిర్వహించగల వైద్య బృందాలను ఎంపిక చేసే విధంగా తగు ఏర్పాట్లను అమలు చేయగలరు .
(7) ఏ విధమైన ఆపశృతులు, ప్రమాదాలు , నేరాలు , కుట్రలకు తావు లేని విధంగా నిరంతరం అదునాతన కెమెరా లతో బాధ్యతలు నిర్వహించగల పర్యవేక్షకులను ముందుగానే ఎంపిక చేసే విధంగా చర్యలు చేపట్టగలరు . మెరుగైన భద్రత గల రవాణా ఏర్పాట్లను పరిశీలించగలరు .
(8) మత పరమైన విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా కొన్ని ఉగ్ర శక్తులు భక్తులు , సామాన్య ప్రజలు తినే ఆహారాల్లోను , ఖర్జురపు పండ్ల లోను , నీటి లోను ఒక రకమైన విష ప్రధార్దాలు కలిపి విక్రయిస్తున్నట్టు ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో వెలుగులోకి వచ్చిన ఘటనలు రాజమండ్రి పుష్కరాల్లో వెలుగు చూడకుండా ముందస్తు నిఘా చర్యలు చేపట్టగలరు .
(9) భక్తుల రద్దిని గుర్తించి అన్ని స్నాన ఘట్టాలకు ఒకే విధమైన ప్రాధాన్యత వుండే విధంగా ప్రచార సాధాన మాధ్యమాలను వినియోగించి భక్తుల మనోభావాలకు దగ్గరగా వుండే విధంగా పిఠాదిపతుల తోను , విజ్నులు, పండితులు తోను అధికారిక ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారాలను ఆధ్యాత్మకంగా చేయించగలరు .
(10) 2015 - రాజమండ్రి పుష్కరాల సందర్బంగా ఆర్ట్స్ కాలేజీ ప్రాగణం వేదికగా రాజమండ్రి పేరును " రాజమహేంద్రవరం " గా మార్చిన ఆనాటి అధికారిక ప్రకటనను రద్దు చేసి గత చరిత్ర అంత ఎంతో వైభవం గాను , వీరొచితంగాను ప్రాచూర్యం పొందిన మా రాజమండ్రి నగరానికి " రాజమంద్రి "
" రాజమందిర్ " అను పేర్లలో ఒక నామాన్ని 2027 రాజమండ్రి పుష్కరాల సందర్బంగా అదే ఆర్ట్స్ కాలేజీ వేదిక ద్వారా శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారు అధికారిక ప్రకటన చేసి రాజమండ్రి ప్రజల మనోభావాలకు అనుగుణంగా మన్ననలు పొందగలరని ఆశిస్తున్నాము .
(11) రాజమంద్రి లేక రాజమందిర్ అను పురాతన సాహితీ నగర పేరును ప్రకటన అనంతరం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ నుండి అధికారిక తీర్మానం జరిపించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో అధికారికంగా గెజిట్ ప్రకటన అమలు చేయగలరు.
(12) కేరళ - కర్ణాటక రాష్ట్రాలలో నీటిలో ఒక రకమైన ప్రమాదకర బ్యాక్తిరియా చెవి, ముక్కు రంద్రాల నుండి శరీరాల్లోకి ప్రవేశించి మరణాలకు దారి తీస్తున్న ఘటన ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది . వైద్యులు సైతం ఈ ప్రమాదకర బ్యాక్తిరియా నుండి కాపాడలేము అంటు చేతులు ఎత్తెస్తున్నారు అని గమనించి తగు ఆరోగ్య భద్రతా ఏర్పాట్లను చేయగలరు.
(13) ఈ మధ్య కాలంలో ఢిల్లీ రెడ్ పోర్ట్ వద్ద కొంతమంది ముష్కరులు జరిపిన కార్ బాంబ్ ఆత్మహుతి దాడిలో జరిగిన కుట్రలను నిశితంగా పరిశీలించి తగు పూర్తి భద్రతా ఏర్పాట్లను 2027 - రాజమండ్రి పుష్కరాల్లో అమలు చేయగలరు .
(14) ఎన్. ఐ. ఏ. వంటి దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛతో కూడిన అధికారాలను అప్పగించి భక్తులు , సామాన్య ప్రజల ప్రాణాలకు పూర్తి స్థాయి రక్షణ, భరోసా కల్పించాలాన్నారు .

ఈ మేరకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టి నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదికను సమర్పించటం జరిగిందన్నారు. ప్రజల ఆరోగ్యాల భద్రత కోసం పేపర్ మిల్లును 3 నెలల ముందుగా నిలిపివేయాలి . రాజమండ్రి ప్రజల మనోభావాలు , ఆత్మగౌరవం కోసం రాజమహేంద్రవరం పేరును " రాజమంద్రి " గా ప్రకటించాలి . ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజల ఆరోగ్యాలకు , రాజమండ్రి ప్రజల మనోభావాలకు , ఆత్మగౌరవానికి భాద్యత వహించి మేము కోరిన విధంగా పాలనా బాధ్యతలను నిర్వహిచాలని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కోరారు .

ఈ విలేఖరుల సమావేశంలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ పెండ్యాల కామరాజు , కొత్తపల్లి భాస్కర రామం , డి వి రమణమూర్తి , దోషి నిషాంత్ , బర్ల ప్రసాద్ ,ఆర్ కే చెట్టి , ఎమ్ డి హుస్సేన్ , వర్ధనపు శరత్ కుమార్ , దుడ్డే త్రినాద్ , కారుమూరి యుగంధర్ , గుడ్ల దుర్గా ప్రసాద్ , బసా సోనియా , మేడిచర్ల శ్రీనివాసరావు , కొప్పాడ రామరాజు , వాడపల్లి జ్యోతిష్ , ద్వాదశి శ్రీనివాసరావు , కొల్లి సత్యనారాయణ , తదితరులు పాల్గొనియున్నారు ..

--పెండ్యాల కామరాజు ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..

5
7 views