
నిడదవోలు నియోజకవర్గంలో ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నా మంత్రి కందుల దుర్గేష్ గారు.
నిడదవోలు నియోజకవర్గంలో ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, పెరవలి మండలం అన్నవరప్పాడు, ఉండ్రాజవరం మండలం వడ్లూరు, నిడదవోలు రూరల్ మండలం రావిమెట్ల, గోపవరం గ్రామాలలో ఇంటింటికీ వెళ్లి స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశాను.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక రోజు ముందుగానే (డిసెంబర్ 31న) రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ చేపట్టడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని పెంచి, అవినీతికి తావులేకుండా నేరుగా వారి ఇంటి వద్దకే అందిస్తున్నాం.
వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు పేరుపేరునా పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకోవడం ఎంతో సంతృప్తినిచ్చింది. మేము స్వయంగా ఇంటికి వెళ్ళి పెన్షన్ అందించడంపై లబ్ధిదారులు వ్యక్తం చేసిన ఆనందం, కృతజ్ఞతలే మాకు నిజమైన బహుమానం.
దేశంలోనే సామాజిక పెన్షన్ల కోసం అత్యధిక నిధులు వెచ్చిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోంది. అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయం. ప్రజల దీవెనలే కూటమి ప్రభుత్వానికి శ్రీరామరక్ష.