"మద్యం తాగి బండి తీస్తే నేరుగా జైలుకే! విజయనగరంలో 1000 మంది పోలీసులతో భారీ తనిఖీలు."
విజయనగరం పట్టణ ప్రాంతంలో నూతన సంవత్సర వేడుకలలో భాగంగా ప్రజల భద్రత, రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, రోడ్డు భద్రతలో భాగంగా *తేదీ. 31.12.2025 రాత్రి 7.00 గంటల నుండి సుమారు 150 ప్రాంతాలలో సుమారు 1000 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహించబడతాయి.*
*ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే నేరుగా జైలుకు పంపండం జరుగుతుంది.*
అదే విధంగా మైనర్ డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్ చేసే వారి పై చర్యలు తీసుకొని వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది. కావున ప్రజలందరూ పోలీసులకు సహకరించి నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో జరుపుకోవాలి.