logo

మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి

🟥NEW SENSE
#Malkajgiri
#NewCommissionerate
#AvinashMohanthyIPS
......
జర్నలిస్టు : మాకోటి మహేష్
*మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి*

కొత్తగా ఏర్పాటైన మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు తొలి కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి ఐపిఎస్. అనంతరం నేరడ్మేట్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ పనితీరు, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి సారిస్తామని తెలిపారు.
కమిషనరేట్ పరిధిలో నేరాలను నియంత్రించడం, ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడం, మహిళలు, పిల్లలు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అలాగే ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ, సమస్యలను వేగంగా పరిష్కరించేలా పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉండేలా అన్ని విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుని పని చేస్తామని ఆయన తెలిపారు.
....

0
0 views