logo

ముందస్తు నిఘా, సత్వర స్పందన, విజిబుల్ పోలీసింగ్, టెక్నాలజీ వినియోగం వల్లనే నేరాలు తగ్గుముఖం:SP

ముందస్తు నిఘా, సత్వర స్పందన, విజిబుల్ పోలీసింగ్, టెక్నాలజీ వినియోగం వల్లనే నేరాలు తగ్గుముఖం

శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 34% నేరాలు తగ్గాయి – జిల్లా ఎస్పీ వెల్లడి

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గుదల, వచ్చే ఏడాదిలో పూర్తిస్థాయిలో నియంత్రిస్తాం. జిల్లా ఎస్పీ

శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి 2025 సంవత్సరానికి సంబంధించిన జిల్లా వార్షిక నేర గణాంకాలను విడుదల చేశారు.

మొత్తం నేరాల పరిస్థితి* 2024 సంవత్సరంలో 9,555 కేసులు నమోదు కాగా,2025లో 6,314 కేసులు నమోదు అయ్యాయి.మొత్తం నేరాల్లో 34 శాతం తగ్గుదల నమోదైనట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

శారీరక నేరాలు (Bodily Offences) 2024లో 812 కేసులు నమోదు కాగా, 2025లో 666 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి.ఈ విభాగంలో 18% తగ్గుదల సాధ్యమైందన్నారు.నేర నియంత్రణలో భాగంగా 2,389 మందిపై బైండ్ ఓవర్ చర్యలు, 20 మందిపై బాండ్ ఫోర్ఫిచర్, రౌడీ షీటర్లు మరియు సమస్యాత్మక కుటుంబాలపై కౌన్సెలింగ్ నిర్వహించామని తెలిపారు.

హత్య కేసులు (Murder)* 2024లో 17 హత్య కేసులు నమోదు కాగా, 2025లో 26 కేసులు నమోదు అయ్యాయి. అక్రమ సంబంధాలు, కుటుంబ కలహాలు, పాత కక్షలు ప్రధాన కారణాలుగా ఉన్నాయని తెలిపారు. రెండు హత్య కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు శిక్షలు విధించబడ్డాయని వెల్లడించారు.

మహిళలపై నేరాలు (Crime Against Women)* 2024లో 477 కేసులు నమోదు కాగా, 2025లో 482 కేసులు నమోదై 1% స్వల్ప పెరుగుదల కనిపించిందన్నారు.
వరకట్న మరణాలు, అత్యాచారం, అపహరణ కేసుల్లో తగ్గుదల కనిపించినప్పటికీ, భార్యాభర్తల మధ్య తగాదాలు స్వల్పంగా పెరిగినట్లు తెలిపారు.
మహిళలపై జరిగిన 24 కేసుల్లో రూ.4.87 లక్షల నష్టపరిహారం అందించబడిందన్నారు.
మహిళా భద్రత కోసం నారీ శక్తి కార్యక్రమం,పాఠశాలలు, కళాశాలలు,గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు,శక్తి యాప్, మహిళా హెల్ప్ డెస్కులు, శక్తి టీమ్స్ ద్వారా రక్షణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

పిల్లలపై నేరాలు (Crime Against Children / POCSO)* 2024లో 39 కేసులు నమోదు కాగా, 2025లో 54 కేసులు నమోదు అయి 38% పెరుగుదల కనిపించిందన్నారు. ఇందులో ఎక్కువగా ప్రేమ వ్యవహారాలు (Elopement / Love Affairs) కారణంగా పిల్లలు ఇంటి నుంచి గ్రామస్తులు, పరిచయం ఉన్న వ్యక్తులతో వెళ్లిపోవడం వల్ల కేసులు పెరిగాయని తెలిపారు.25 కేసుల్లో రూ.7.80 లక్షల పరిహారం అందించామన్నారు.నియంత్రణ చర్యలుగా పాఠశాలల్లో గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అవగాహన, శక్తి టీమ్స్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఎస్సీ / ఎస్టీ అట్రాసిటీ కేసులు* 2024లో 66 కేసులు నమోదు కాగా, 2025లో 44 కేసులు మాత్రమే నమోదు అయి 33% తగ్గుదల సాధ్యమైందన్నారు.

40 కేసుల్లో రూ.40.75 లక్షల పరిహారం అందించగా, 3 కేసుల్లో నిందితులకు జైలు శిక్షలు విధించబడ్డాయని తెలిపారు.

ఆస్తి సంబంధ నేరాలు (Property Offences)* 2024లో 411 కేసులు నమోదు కాగా, 2025లో 396 కేసులు నమోదయ్యాయి.చోరీకి గురైన ఆస్తుల్లో 91% బాధితులకు తిరిగి అందజేయడం, రూ.4.08 కోట్లలో రూ.3.71 కోట్లు రికవరీ చేయడం జరిగిందన్నారు.2025లో 71% కేసుల్లో ప్రాపర్టీ రికవరీ సాధ్యమైందన్నారు.

రోడ్డు ప్రమాదాలు* 2024లో 279 ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా, 2025లో 243 ప్రమాదాలు మాత్రమే నమోదు అయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 21% తగ్గుదల నమోదైందన్నారు. రాబోయే ఏడాది రోడ్డు ప్రమాదాల నివారణకు మరింత ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ / ఓపెన్ డ్రింకింగ్* డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 6,338 కేసులు నమోదు కాగా, 38 మందికి జైలు శిక్షలు, 286 మందికి రూ.10,000 చొప్పున జరిమానాలు విధించబడ్డాయి.
ఓపెన్ డ్రింకింగ్ కేసుల్లో 13,000 మందిపై కేసులు నమోదు కాగా, 18 మందికి సాధారణ కారాగార శిక్షలు విధించబడ్డాయని తెలిపారు.

గంజాయి & NDPS కేసులు* 2025లో 137 కేసులు నమోదు చేసి, 1,774 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 7 మందికి 4 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్షలు విధించబడ్డాయని, జిల్లాలో 16 మంది రిపీట్ ఆఫెండర్లగా గుర్తించిన వారిలో 9 మందిపై PIT NDPS చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

అభ్యుదయం సైకిల్ యాత్ర”, “సంకల్పం” వంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

సీసీ కెమెరాలు & టెక్నాలజీ* 2025లో జిల్లావ్యాప్తంగా 3,758 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, వాటి ద్వారా 94 కేసుల ఛేదన సాధ్యమైందన్నారు.

kమొబైల్ ఫోన్లు రికవరీ*
CEIR పోర్టల్ ద్వారా ఈ ఏడాది 1,060 మొబైల్ ఫోన్లు (రూ.1.64 కోట్లు విలువ) రికవరీ చేసి బాధితులకు అందించామని తెలిపారు.

మిస్సింగ్ కేసులు* 2024లో 408 కేసులు నమోదు కాగా, 2025లో 353 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఇందులో 303 కేసులు ట్రేస్ చేయగా, మొత్తం మిస్సింగ్ కేసుల్లో 13% తగ్గుదల నమోదైందన్నారు.
వైట్ కాలర్ & సైబర్ నేరాలు
మొత్తం నేరాల్లో 13% తగ్గుదల, సైబర్ నేరాల్లో 24% తగ్గుదల నమోదైందన్నారు. 1930 హెల్ప్‌లైన్ ద్వారా తక్షణ స్పందన అందిస్తున్నామని తెలిపారు.

రౌడీ / సస్పెక్ట్ షీట్స్*. 2025లో 144 రౌడీ షీట్లు, 204 సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయగా, జిల్లాలోని 1,870 హిస్టరీ షీటర్లపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. ప్రతి ఆదివారం నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రజా సేవలు,పబ్లిక్ గ్రీవెన్స్.* PGRS ద్వారా వచ్చిన 2,758 పిర్యాదుల్లో 2,686 పిర్యాదులు పరిష్కరించామని తెలిపారు.

112 అత్యవసర స్పందన.* 2025 సంవత్సరంలో మొత్తం 112 నెంబర్ ద్వారా 9622 కాల్స్ రాగా వాటిలో 237 కేసులు నమోదు చేయడం జరిగింది.112 కాల్స్‌కు స్పందన సమయాన్ని పట్టణాల్లో 10–12 నిమిషాల నుంచి 8–10 నిమిషాలకు, గ్రామీణ ప్రాంతాల్లో 25–30 నిమిషాల నుంచి 10–15 నిమిషాలకు తగ్గించినట్లు తెలిపారు.

లోక్ అదాలత్* లోక్ అదాలత్ ద్వారా 2,990 కేసులు ఈ ఏడాది లో పరిష్కరించబడ్డాయి.

2026 నూతన సంవత్సర లక్ష్యాలు
మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం, నార్కోటిక్ & సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి,అధునాతన సాంకేతికతతో నేర నియంత్రణ,ప్రజల సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణ,ప్రజలకు మరింత చేరువగా, క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన పోలీస్ సేవలు అందించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం నిబద్ధతతో పనిచేస్తుందని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి తెలిపారు.

0
0 views