logo

కిలో రూ. 20 కే గోధుమ పిండి పంపిణీ

శ్రీకాకుళం, డిసెంబర్ 30:శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని రేషన్ కార్డుదారులకు జనవరి 2వ తేదీ నుండి చౌక ధరల దుకాణాల ద్వారా ఒక్కో కార్డుకు ఒక కిలో చొప్పున గోధుమ పిండిని పంపిణీ చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపడుతున్న ఈ పంపిణీలో భాగంగా కిలో గోధుమ పిండి ధరను 20 రూపాయలుగా నిర్ణయించామని, అర్హులైన వినియోగదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

0
0 views