logo

జె నాయుడుపాలెం గ్రామంలో నగర సంకీర్తన

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జె. నాయుడుపాలెం గ్రామంలో వైకుంఠ ఏకాదశి పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని ఘనంగా నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. లాలం నరసింహారావు, పచ్చిగోల్ల తాతాజీ ల ఆధ్వర్యంలో గ్రామంలోని యువకులు చురుకుగా పాల్గొని గ్రామ పురవీధుల గుండా తిరిగి హరినామ స్మరణతో భజనలు, సంకీర్తనలు చేశారు. ఈ కార్యక్రమం గ్రామస్తులలో భక్తి భావాన్ని మరింత ఉద్దీపించింది. వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం నుంచే భక్తులు సమాగమం కావడం జరిగింది. గ్రామంలోని యువకులు ముందువరుసలో నిలబడి , సంకీర్తన బృందానికి రాగం ఇచ్చారు. ప్రధాన రోడ్లు, పురవీధులు, ఆలయాల సమీపంలో తిరిగిన ఈ యాత్ర హరి నామాలు, రామ భజనలతో మారుమోగింది. గ్రామస్తులు అందరూ ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామంలోని యువకులు ఈ సంకీర్తనలో చురుకుగా పాల్గొని ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని ప్రదర్శించారు. మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ భక్తి మయంగా చేరి గ్రామ ఐక్యతను ప్రతిబింబించారు వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది శాస్త్రాలు చెబుతున్నాయి. ఇటువంటి సంకీర్తనలు పాప నిర్మూలనకు, మోక్ష ప్రాప్తికి మార్గం. జె. నాయుడుపాలెం గ్రామం ఇలాంటి ఆచారాలతో తన సంప్రదాయ భక్తిని కాపాడుకుంటూ యువతను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తోంది.

10
392 views