logo

వసతి గృహ నిర్మాణమునకు ఒక లక్ష విరాళం: ఆలయ ఈవో యం. రామక్రిష్ణ.

పాణ్యం (AIMA MEDIA): ప్రముఖ శైవక్షేత్రం పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు భక్తుల సౌకర్యార్థం నిర్మాణము గావించబడుతున్న వసతి గృహము నిర్మాణము నిమిత్తము భక్తులు 1 లక్ష 1116/ లు సోమవారం విరాళంగా సమర్పించినట్లు ఆలయ ఈవో యం. రామకృష్ణ తెలిపారు. కర్నూలు పట్టణంలో చెందిన పంచాగ్నుల మల్లికార్జున శాస్త్రి జ్ఞాపకార్థం కుమారుడు పి.రమేష్ భరద్వాజ్ అనే భక్తుడు వారికి స్వామివారు ఇంటి ఇలవేల్పు కావడంతో మొక్కుబడిగా రూ.1,01,116/ లు ఒక లక్ష ఓక వెయ్యి నూట పదహారు రూపాయలు విరాళంగా సమర్పించారని, వారికి ఆలయ మర్యాదలతో అభిషేకములు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించి శేష వస్త్రములతో సత్కరించి, స్వామివారి ప్రతిమ, ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సురేష్ శర్మ, గ్రామ పెద్దలు మిలిటరీ సుబ్బారెడ్డి, దాత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

0
598 views