logo

శ్రీ వాసపురం వెంకటేశ్వర స్వామి 21 రోజుల మాల,ఇరుముడి కట్టుకుని పాదయాత్రగా స్వామి సన్నిధికి పయనం.

నంద్యాల జిల్లా రుద్రవరం మండలం కొండమాయపల్లె పంచాయతీ వెలగలపల్లె పొలిమేరలో వెలిసినటువంటి.
శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి
మాల స్వీకరించి నేటితో 21 రోజు
దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం నాడు రుద్రవరం మండలం కొండమాయ పల్లె గ్రామం ఆంజనేయస్వామి గుడి నుండి ఇరుముడితో శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు సాంస్కృతిక కోలాటంతో స్వామివారి భక్తి గీతాలతో కాలినడకన బయలుదేరిన స్వాములు మరియు భక్తాదులు. శ్రీ వాసపురం వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు సింగతల మధుసూదన్ రెడ్డి,రంగనాయకులు, కానాల వెంకట నరసింహుడు ఆహ్వానం మేరకు ఆళ్లగడ్డ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్
గంధం వీర రాఘవరెడ్డి పాల్గొని స్వాములు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాల ధారణ చేసిన స్వాముల కుటుంబ సభ్యులు మరియు గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు.

60
2501 views