
నువ్వుల పంటకు విత్తనాలు సిద్ధం, ఆర్ బి కే అధికారి చిరంజీవి
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రోలుగుంట ఆర్ బి కే కార్యాలయంలో మండలంలోని సచివాలయ వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో వ్యవసాయ అధికారి చిరంజీవి మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్ లో 5800 ఎకరాల్లో వరి వేయడం జరిగిందని ఎకరాకు 20 నుంచి 25 గంటలు దిగబడి వచ్చిందని తెలిపారు అలాగే. రవి సీజన్లో నువ్వు పంట వేయుటకు 100 ఎకరాలకు విత్తనాలు సిద్ధం చేస్తున్నామని, విత్తనాలు రకాలు వై ఎల్ ఆర్ 66, వై ఎన్ ఆర్ 146, ఈ రెండు రకాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. అలాగే ఈ రకం విత్తనాలు నువ్వులు ఎకరాకు ఐదారు బస్తాలు దిగుబడి వస్తుందన్నారు. రైతుల ముఖ్యంగా దుక్కులో సూపర్ ఫాస్పేట్ కలుపు మందు వినియోగిస్తే ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. అలాగే రైతు కేంద్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ప్రారంభించిన వారం రోజుల్లోనే సుమారు 200 టన్నులు ధాన్యం సేకరించడం జరిగిందని, ఈ ఏడాది రైతుల నుంచి 500 ప్రజల వరకు ధాన్యం సేకరించడం జరుగుతుందని తెలిపారు. సేకరించిన 48 గంటల్లో రైతులకు వారి అకౌంట్లో డబ్బులు జమవుతాయి అన్నారు. అలాగే రబీలో యూరియా పెంచడం జరుగుతుందని తెలిపారు. అవసరమైన రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మండలంలో ఉన్న అన్ని పంచాయతీ సచివాలయాలకు సంబంధించిన రైతు భరోసా అధికారులు పాల్గొన్నారు.