గుండె జబ్బుల్నీ కనిపెట్టే స్టెతస్కోప్
**గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య
కేంద్రాల ద్వారా ఇది ప్రాణదాతగా
మారుతోంది.**
తెలంగాణ స్టేట్ ***భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ***డిసెంబర్ 29***₹( ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
*గుండె జబ్బుల్నీ కనిపెట్టే స్టెతస్కోప్!*
AI.. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. అందులో ప్రధానమైంది 'ఏఐ స్టెతస్కోప్'. బెంగళూరుకు చెందిన 'ఏఐస్టెత్' (AiSteth) సంస్థ రూపొందించిన ఈ పరికరం గుండె, ఊపిరితిత్తుల శబ్దాలను విశ్లేషించి, కేవలం 30 సెకన్లలో సమస్యలను పసిగడుతుంది. బ్లూటూత్ ద్వారా స్మార్ట్ఫోను అనుసంధానమై, క్లిష్టమైన జబ్బులను తొలిదశలోనే గుర్తించి ప్రాణాపాయం తగ్గిస్తుంది. ముఖ్యంగా నిపుణుల కొరత ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఇది ప్రాణదాతగా మారుతోంది.