logo

సాంకేతిక లోపాలు ఉంటే తెలపండి

ఐసిడిఎస్ రావికమతం ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్లకు పంపిణీ చేసిన ఫైజీ వర్షన్ మొబైల్ ఫోన్లలో సాంకేతిక లోపాలు ఉంటే మంగళవారం సాయంత్రం లోపల తెలియజేయాలని సిడిపిఓ శ్రీమతి మంగతాయారు ప్రకటించారు.రోలుగుంట, రావికమతం, బుచ్చయ్యపేట, చోడవరం మండలాల్లోని అన్ని అంగన్వాడి సెంటర్లకు ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు ఇటీవల ఈ మొబైల్ ఫోన్లు పంపిణీ చేసిన విషయం తెలిసినదే. వీటి పనితీరు పై ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని, అయినప్పటికీ ఏమైనా లోపాలు ఉంటే త్వరగా తెలియజేయాలని ఉన్నతాధికారులు సోమవారం ఆదేశాలు జారీ చేశారని సిడిపిఓ వివరించారు.ఈ మేరకు రావికమతం ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడి కార్యకర్తలు లోపాలు ఉంటే మంగళవారం సాయంత్రం లోపల తెలియజేయాలని రోలుగుంట, బుచ్చయ్య పేట సెక్టారు సూపర్‌వైజర్లు ఎస్కే బేగం, హైమలత గారు స్పష్టం చేశారు.

4
167 views