logo

వేతనాలు అందక కార్మికులకు కష్టాలు

వేతనాలు అందక కార్మికులకు కష్టాలు

ఏఐటీయూసీ

ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్సు నైట్ వాచ్మెన్లు మధ్యాహ్న భోజన పథక కార్మికులు అక్టోబర్ నవంబర్ మాసాలు సంబంధించిన వేతనాలు చెల్లించాలని సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కడప కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు జి వేణుగోపాల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కెసి. బాదుల్లా మధ్యాహ్న భోజన పథకం వర్కర్ యూనియన్ గౌరవాధ్యక్షులు చాంద్ బాషా నగర కార్యదర్శి ఉద్దె మద్దిలేటి లు మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తామని పెద్దపీట వేస్తున్నామని మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప ఆచరణలో సాధ్యం కావడం లేదన్నారు. చిరు కార్మికులైన స్వీపర్సు నైట్ వాచ్మెన్లకు నెలకు 6000 రూపాయల వేతనం మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు 3000 వేతనం నాము మాత్రం అయినా రెండు నెలలు మూడు నెలలు పెండింగ్లో ఉంచితే కుటుంబాలు ఎట్లా గడవాల అని ప్రశ్నించారు. స్కూలు తెరిచినప్పటినుంచి మోసే అయేంతవరకు అక్కడే ఉండి వ్యక్తి చాకిరీ చేయించుకుంటూ పనికి తగ్గ వేతనం ఇవ్వకపోవడం కనీస వేతనాలు కూడా అమలు చేయకపోవడం బాధాకరంగా ఉందన్నారు. సామాజిక భద్రతా చట్టంలో భాగంగా వీరికి ఈఎస్ఐ ఈపీఎఫ్ సౌకర్యాలు కానీ అమలు చేయకపోవడం కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే జనవరి సంక్రాంతి పండుగల పూటైనా పచ్చులు ఉండకుండా వేతనాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి లింగన్న మధ్యాహ్న భోజన పథకం యూనియన్ జిల్లా కార్యదర్శి సులోచనమ్మ నాయకురాలు లక్ష్మీదేవి రమణ మస్తానీ భాషా స్కూల్ స్లిప్పర్స్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గౌసియా నాగలక్ష్మి కుమారి నైట్ వాచ్మెన్ యూనియన్ జిల్లా కార్యదర్శి నరసయ్య మురళి గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు.

0
35 views