logo

కడప నగరంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఏర్పాటు చేయాలి

కడప నగరంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఏర్పాటు చేయాలి
ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జయవర్ధన్ డిమాండ్

కడప నగరంలో దేశ స్వాతంత్ర్య పోరాట యోధుడు, ఆజాదీ సమరశీలి నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో కడప నగరపాలక సంస్థ మేయర్ పాక సురేష్ కుమార్ గారికి
వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి జయవర్ధన్ మాట్లాడుతూ...
కడప నగరం సుందరీకరణలో భాగంగా పలుచోట్ల అనేక విగ్రహాలు ఏర్పాటు చేశారని, కానీ దేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క విగ్రహం లేకపోవడం చాలా బాధాకరమని ఆయన వాపోయారు. నగరంలోని ప్రజలకు ప్రేరణగా నిలిచే విధంగా ప్రముఖ ప్రాంతంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశ స్వాతంత్ర్య సాధనలో కీలక పాత్ర పోషించిన మహానాయకుడని, యువతలో దేశభక్తి, త్యాగ భావనలను పెంపొందించడంలో ఆయన ఆలోచనలు ఎంతో అవసరమని ఈ సందర్భంగా జయవర్ధన్ పేర్కొన్నారు. కడప నగరంలో నేతాజీ విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా రాబోయే తరాలకు ఆయన ఆశయాలు చేరువవుతాయని తెలిపారు.
ఈ వినతిపై మేయర్ గారు సానుకూలంగా స్పందించి, నగరపాలక సంస్థ స్థాయిలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకులు రాజేంద్ర ప్రసాద్ ఓబయ్యా, పాల్గొన్నారు.

అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ
రాష్ట్ర కార్యదర్శి: జయవర్ధన్

0
57 views