logo

మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పలకరించడంపై కేటీఆర్

మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పలకరించడంపై కేటీఆర్ స్పందించారు. ‘‘తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్‌ పట్ల తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి గౌరవం ఉంది. ముఖ్యమంత్రి సభలో కేసీఆర్‌ను కలిసేంత సంస్కారం ఉంటే చాలు. ఇదే సంస్కారం బయట మాటల్లో ఉంటే బాగుంటుంది. రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు పలకరించుకునేంత సానుకుల వాతావరణం ఉంటే మంచిదే’’ అని కేటీఆర్‌ అన్నారు. అసెంబ్లీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.

0
177 views