
టి అర్జాపురంలో లేగ దూడల ప్రదర్శన
అనకాపల్లి జిల్లా రావికమతం మండలం టి.అర్జాపురం గ్రామంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో లేగ దూడల ప్రదర్శన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానిక రైతులు పెద్ద ఎత్తున పాల్గొని స్వదేశీ జాతి పశువుల సంరక్షణ, అభివృద్ధిపై అవగాహన సంపాదించారు. కార్యక్రమం వివరాలు కేంద్ర ప్రభుత్వ రాష్ట్రీయ గోకుల్ మిషన్ లో భాగంగా ఈ దూడల ప్రదర్శనను పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వదేశీ పశువుల ఉత్పాదకత పెంపు, మంచి జాతి దూడల పెంపకాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యంగా నిర్వాహకులు పేర్కొన్నారు. , కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు, మేడివాడ కోఆపరేటివ్ చైర్మన్ గుటాల చిన్న పాల్గొని రైతులకు ఉద్దేశించి మాట్లాడారు. టి.అర్జాపురం వైస్ ప్రెసిడెంట్ సీతిన రాము, రావికమతం బిజెపి ప్రధాన కార్యదర్శి దంట్ల సత్యనారాయణ, రోలుగుంట తట్ట బంధ, కొత్తకోట పశు వైద్యాధికారులు, ఏడి పర్యవేక్షణలో కార్యక్రమ ఏర్పాట్లు జరిగాయి. కార్యక్రమం ఉదయం నుంచే దూడలతో రైతులు వచ్చి ఆరోగ్యం, జాతి గుణాత్మక తో, సంరక్షణ పద్ధతుల ఆధారంగా నిపుణులు పరిశీలించారు. ప్రదర్శనలో పాల్గొన్న పశుసంవర్థక అధికారులు మంచి దూడల ఎంపిక, ఆహార నిర్వహణ, టీకాల ప్రాముఖ్యత పై రైతులకు సూచనలు అందించారు. ఈ కార్యక్రమం ద్వారా స్వదేశీ జాతుల సంరక్షణ తోపాటు పాడి పరిశ్రమను లాభదాయకంగా మార్చుకోవచ్చని అధికారలు వివరించారు. ఎంపికైన ఉత్తమ దూడలకు పురస్కారాలు, ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం ద్వారా మరింత మంది రైతులు ఈ మిషన్‌లో భాగస్వాములు కావాలని పశుసంవర్ధక శాఖ పిలుపునిచ్చింది.