logo

కడప మేయర్ - మార్నింగ్ విజిట్*

*కడప మేయర్ - మార్నింగ్ విజిట్*

*#ఈరోజు కడప మేయర్ మార్నింగ్ విజిట్ లో భాగంగా 1వ డివిజన్ కార్పొరేటర్ చెన్నయ్య & 2 వ డివిజన్ ఇంచార్జ్ లు రామకృష్ణ & సుబ్బరాయుడు, YSRTUC రాష్ట్ర నాయకులు సుదర్శన్ రాయల్ గార్ల ఆధ్వర్యంలో కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ గారు మరియు డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు దేవుని కడప నందు పర్యటించారు..*

*తిరుమల తిరుపతి తొలి గడప - దేవుని కడప . రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా కడప నగరంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం పరిసరాలు చుట్టూ స్వీపింగ్ చేయాలని, మాడ వీధులను నీటి ట్యాంకర్ల ద్వారా శుభ్రం చేయాలని MHO రమేష్ గారిని మేయర్ గారు ఆదేశించారు...*


*దేవుని కడప లోని ఆలయం బయట నగర పాలక సంస్థ నిర్మించిన పబ్లిక్ టాయిలెట్ ను మేయర్ గారు పరిశీలించి అనంతరం టాయిలెట్స్ శుభ్రం చేపించి వాటర్ కనెక్షన్ ఇవ్వవలసినదిగా ఇంజనీరింగ్ అధికారులు DE బాల మల్లేశ్వర్ , AE లు ప్రశాంత్ రెడ్డి & శ్రీనివాసులు రెడ్డి గార్లను ఆదేశించారు...*

*ఆలయం చుట్టూ ఉన్న పరిసరాలను JCB ద్వారా క్లీన్ చేసి పార్కింగ్ కు అనువుగా ఉంచాలని మరియు బ్లాక్ అయిన డ్రైనేజ్ వాటర్ ను గల్ఫర్ మిషన్ లతో క్లీన్ చేయాలని శానిటేషన్ అధికారులు పూజిత్ రెడ్డి ,నరేష్ ,బాబు, నాగసుబ్బయ్యల కు మేయర్ గారు ఆదేశించారు...*

*టీటీడీ వారి ఆధ్వర్యం లో దేవుని కడప ఆలయం శోభాయమానం గా అభివృద్ధి చెందుతుందని తెలిపారు....*

*రేపటి నుండి పబ్లిక్ టాయిలెట్ నిర్వహణ టీటీడీ వారికి అప్పగిస్తామని మేయర్ గారు తెలిపారు...*

*వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఫోన్లో DMHO గారితో ఈరోజు రాత్రి నుండి రేపటి వరకు ఒక అంబులెన్స్ ను మరియు ఒక మెడికల్ క్యాంప్ గుడి ఆవరణలో అందుబాటులో ఉంచాలని మేయర్ గారు ఆదేశించారు...*

*పోలీసు అధికారులకు భక్తులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా చేయాలని మేయర్ గారు కోరారు...*

*మేయర్ పాక సురేష్ కుమార్ గారిని మరియు డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారిని డివిజన్ ఇంచార్జిలు రామకృష్ణ , సుబ్బరాయుడు లు స్థానిక నాయకులు శివ ,రవి లు సన్మానించారు...*

*ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు & డివిజన్ ఇంచార్జ్ లు బాలస్వామి రెడ్డి,శ్రీ రంజన్ రెడ్డి,సుబ్బరాయుడు , వైఎస్ఆర్సిపి నాయకులు రెడ్డయ్య, వాసు, సచివాలయ సెక్రెటరీ లు & ఫిట్టర్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు...*

9
626 views