logo

రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా AIMA న్యూస్ ప్రత్యేక కథనం.

AIMA న్యూస్ బ్యూరో. ముక్కోటి వైకుంఠ ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఈరోజు వైష్ణవాలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఉత్తర ద్వార దర్శనం శ్రీమహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని భక్తుల నమ్మకం. అందుకే అన్ని వైష్ణవ క్షేత్రాల్లో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు. ఇలా దర్శించుకోవడం వల్ల కోటి ఏకాదశుల పుణ్యం లభిస్తుందని, అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి' అని పిలుస్తారు.పురాణ గాథ పురాణాల ప్రకారం, ఈ రోజునే క్షీరసాగర మధనంలో అమృతం ఉద్భవించింది. అలాగే, మురాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి విష్ణువు తనలో నుంచి ఒక శక్తిని (ఏకాదశి కన్య) సృష్టించిన రోజు కూడా ఇదే. ఆమె భక్తికి మెచ్చిన విష్ణువు, ఈ రోజున తనను పూజించిన వారికి మోక్షం ప్రసాదిస్తానని వరమిచ్చాడు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఈ రోజున ఉపవాసం ఉండి, జాగరణ చేసి స్వామిని ధ్యానిస్తే పునర్జన్మ లేకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించిన రోజు కూడా ఇదే అని చెబుతారు.వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఉపవాసం ఏకాదశి తిథి మొత్తం నిరాహారంగా ఉండటం శ్రేష్టం. ఆరోగ్య కారణాల వల్ల కుదరని వారు పండ్లు తీసుకోవచ్చు. జాగరణ రాత్రంతా నిద్రపోకుండా విష్ణు సహస్రనామ పారాయణం లేదా భజనలు చేస్తూ స్వామిని స్మరించాలి. ఏకాదశి రోజున బియ్యంతో చేసిన పదార్థాలు తినకూడదు (ముఖ్యంగా అన్నం తినకూడదని శాస్త్రం చెబుతోంది).ముఖ్యమైన క్షేత్రాలు తెలుగు రాష్ట్రాల్లో తిరుమల, భద్రాచలం, మంగళగిరి, అహోబిలం,దేవుని కడప, వంటి క్షేత్రాల్లో ఈ పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది. తిరుమలలో శ్రీవారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.

25
1488 views