logo

*విజయనగరం జిల్లా జూజిట్సు క్రీడాకారుడు జాతీయ స్థాయిలో వెండి పతకం సాధించాడు*


ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్టేడియంలో డిసెంబర్ 19 నుంచి 23 వరకు జరిగిన జాతీయ జూజిట్సు ఛాంపియన్‌షిప్ (U-8 నుంచి U-18 వర్గాలు)లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా జూజిట్సు అసోసియేషన్ నుంచి ఐ. రవి అద్వర్యంలో పాల్గొన్న ముగ్గురు విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచారు.

*ఐ. జగదీష్* (U-16 వర్గం, -48 కేజీల కేటగిరీ)

*బి. సాయిచరణ్ తేజ* (U-14 వర్గం, +69 కేజీల కేటగిరీ)

*జి. పునీత్ సత్య శ్రీకర్* (U-14 వర్గం, -56 కేజీల కేటగిరీ)

ఈ ముగ్గురిలో జి. పునీత్ సత్య శ్రీకర్ U-14 వర్గంలో -56 కేజీల కేటగిరీలో అద్భుతంగా పోరాడి వెండి పతకం (సిల్వర్ మెడల్) సాధించాడు. ఈ విజయం విజయనగరం జిల్లా జూజిట్సు అసోసియేషన్‌కు గర్వకారణంగా నిలిచింది.

ఈ విజయాన్ని భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు పి. సంగర్, శ్రీ వాణి సంతోష్ స్కూల్ ప్రిన్సిపల్ కె. ప్రియాంక, స్కూల్ డైరెక్టర్ ఎన్.వి. రాంప్రసాద్ మరియు స్థానిక గ్రామస్థులు హృదయపూర్వకంగా అభినందించారు.
జూజిట్సు అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఈ జాతీయ పోటీల్లో దేశవ్యాప్తంగా వందలాది మంది యువ క్రీడాకారులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా నుంచి ఈ విజయం రాష్ట్రంలో జూజిట్సు క్రీడకు కొత్త ఉత్సాహాన్ని నింపింది.

1
592 views