logo

చదువు బ్రతుక్కి బాట చూపుతుంది **పీకే ఓసి రక్షణ అధికారి మేడూరు లింగబాబు ,

చింతలపూడి*ఏలూరు జిల్లా* ఆంధ్ర ప్రదేశ్*
డిసెంబర్ 28** ఏఐఎంఏ మీడియా ప్రతినిధి**



చదువు బ్రతుక్కి బాట చూపుతుంది

**పీకే ఓసి రక్షణ అధికారి మేడూరు లింగబాబు,

*శ్రీ విద్యాభ్యాస మరియు ఆరీఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమానికి క్వింటాన్నర బియ్యం అంద జేత ,

చదువు బ్రతుక్కి బాట చూపుతుందనీ ఉన్నత లక్ష్యాన్ని చేరాలంటే చదువుకు మించిన మార్గం మరొకటి లేదని పీకే ఓసి రక్షణ అధికారి మేడూరు లింగబాబు అన్నారు ఆదివారం సాయంత్రం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చీకటి వారి కొత్తగూడెం గ్రామానికి చెందిన చీకటి బ్రహ్మానందం సూర్య వర్ధనమ్మ దంపతుల ఆధ్వర్యంలో వారి కుమారుడు సర్వేష్ ఏర్పాటు చేసిన మణుగూరు శ్రీ విద్యాభ్యాస పాఠశాలకు డబ్బయి ఐదు కిలోలు మరియు అశ్వాపురం ఆరీఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమానికి డబ్బయి ఐదు కిలోలు వెరసి క్వింటాన్నర బియ్యం వితరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దాతల సహకారంతో చదువుతోపాటు కళలు క్రీడలలో కూడా రాణించాలని ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా దాతలు చీకటి సర్వేష్ కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ సమన్వయకర్త సింగరేణి సేవా సమితి సభ్యులు యస్ డి
నాసర్ పాషా, శ్రీ విద్యాభ్యాస పాఠశాల నిర్వాహకులు బి జగన్మోహన్ రెడ్డి, వృద్ధాశ్రమం నిర్వాహకులు షేక్ మేహారాజ్, ఐతం రాజు యాదగిరి,బి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

80
1559 views