logo

కొత్తగూడెంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం

కొత్తగూడెం 3 టౌన్ సెంటర్‌లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు సందర్భంగా మహాత్మా గాంధీ,మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి అమరులకు ఘన నివాళులు అర్పించారు.జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో తోట దేవి ప్రసన్న,రాష్ట్ర నాయకులు కోనేరు సత్య నారాయణ,ఆళ్ళ మురళి,నాగ సీతారాములు, జేబీ బాలసౌరి, ఏనుగుల అర్జున్ రావు,చీకటి కార్తీక్ లు మాట్లాడుతూ.. దేశ ఐక్యత, సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఉద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ వై.శ్రీనివాసరెడ్డి,చింతలపూడి రాజశేఖర్,బాల పాసి,రావి రాంబాబు, మే రెడ్డి జనార్ధన రెడ్డి, పరమేష్ యాదవ్,పాల సత్య నారాయణ రెడ్డి, తలుగు అనిల్, ఆకుల సుధాకర్, సుందర్ లాల్ కోరి,దుంపల రాజేష్, జానీ పాషా,మాధవ్, రాజేష్,
మహిళా కాంగ్రెస్ నాయకులు గడిపల్లి కవిత, రాజ్యలక్ష్మి,జోగు రమాదేవి, నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు,వార్డు మెంబర్లు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

4
188 views