logo

ఓం శక్తి ఆలయంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ల ఆవిష్కరణ...

ఓం శక్తి ఆలయంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ల ఆవిష్కరణ
నగరి నియోజకవర్గం, నగరి పట్టణంలో వెలసిన ఓం శక్తి ఆలయంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇరుముడి ధరించి వచ్చిన ఓం శక్తి భక్తులందరికీ నూతన క్యాలెండర్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ ఏడిఈ ప్రభాకర్ రావు, ఏఈ బాలచందర్, జేఈ ఉమాపతి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన అడ్వర్టైజ్‌మెంట్ దాతలు కూడా అమ్మవారి సేవలో పాల్గొని క్యాలెండర్ల ఆవిష్కరణలో భాగస్వాములయ్యారు.
అనంతరం అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, భక్తులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, అమ్మవారి సేవకులు, ఓం శక్తి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

14
699 views