logo

సోషల్ మీడియా వేదికగా పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి గారి పై అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం - డా. జీలాన్*

*సోషల్ మీడియా వేదికగా పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి గారి పై అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం - డా. జీలాన్*

కడప నగరంలో 50 లక్షల సొంత నిధులతో CCTV కెమెరాలు ఏర్పాటు చేసిన ఘన చరిత్ర రెడ్డప్ప గారి కుటుంబానిది. CMRF అంటే శ్రీనివాసులు రెడ్డి- శ్రీనివాసరెడ్డి అంటే CMRF లా వందల మందికి 0% కమిషన్ తో సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిన ప్రజా నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారు. కొన్ని వేల మందికి తన వంతుగా కొన్ని లక్షల రూపాయలు సభ్యత్వ రుసుము చెల్లించి ప్రమాద భీమ కల్పించిన ప్రదాత . క్రీడాకారులకు బహుమానంగా ఐదు లక్షల నగదు సొంతంగా ఇచ్చి ప్రోత్సహించిన వ్యక్తి, కరెంటు ప్రమాదంతో క్షతగాత్ర అయినా మైనారిటీ పిల్లలకు సొంతంగా చికిత్స చేయించిన నిస్వార్థ ప్రజా సేవకుడు శ్రీనివాసరెడ్డి గారు. ఇలా అనేక ప్రజాసేవ కార్యక్రమాలు చేసిన మహాశయులపై నిందారోపణలు చేయడం తగదు. కడపలో అత్యంత పారదర్శకంగా పాలన సాగించాలని గట్టి సంకల్పానికి కట్టుబడి పని చేస్తున్న వారిపై అసత్య ఆరోపణలు చేయడం వక్రీకరించిన వీడియోలను ప్రదర్శించడం అర్ధరహితం. P4 విధానంలో పాల్గొని సమాజంలో మార్గదర్శకంగా నిలవాలని సంపన్న కుటుంబాలకు వారి విన్నపం. వైకాపా నాయకులు విమర్శించే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలని మనవి.

Dr. Jeelan Basha
Tdp spokesperson kadapa..

6
109 views