logo

ఎరువులు మరియు పురుగుమందుల దుకాణాలు ఆకస్మికంగా తనిఖీ.

నంద్యాల (AIMA MEDIA): నంద్యాల జిల్లా కేంద్రంలో గల పలు ఎరువులు మరియు పురుగుమందుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు.తనిఖీలో భాగంగా సుదర్శన్ ట్రేడర్స్ , లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్, సేగు శ్రీనివాసులు అండ్ బ్రదర్స్ దుకాణాల యందు స్టాక్ రిజిస్టర్ ,బిల్ బుక్స్, రసీదులను బయో ఉత్పత్తుల కంపెనీలకు సంబంధించిన అనుమతి పత్రాలను, దుకాణం లోని నిలువలను పరిశీలించడం జరిగింది. ఆలాగే యూరియా నిల్వలను, రోజువారీ అమ్మకాలను పరిశీలించడం జరిగినది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ యూరియా వివరాలను ప్రతీ రోజు వ్యవసాయ శాఖ వారు రూపొందించిన బోర్డు యందు అప్డేట్ చెయ్యాలని, యూరియా MRP కంటే అధికంగా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీస్కుంటామని హెచ్చరించారు. సరైన ద్రువ పత్రాలు సమర్పించనందున పలు బయో ఉత్పత్తులు మరియు ఎరువుల కంపెనీలకు సంబంధించిన సుమారు 10 లక్షల రూపాయల విలువ గల ఉత్పత్తుల అమ్మకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి నంద్యాల వారు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా అనుమతి పొందిన ఎరువులను మాత్రమే దూకాన దారులు విక్రయించాలని, అదేవిధంగా బయో ఉత్పత్తుల అమ్మకాలకు అవసరమైన అన్ని ధృవ పత్రాలు దుకాణం దారులు సరిగా నిర్వహించాలని లేనిచో FCO 1985 చట్టం ప్రకారం దుకాణాల పై చట్టపరమైన చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు.

3
3 views