
వై.ఎస్.ఆర్ కడప జిల్లా...*
*వై.ఎస్.ఆర్ కడప జిల్లా...*
*➡️ రోడ్డు ప్రమాదాల నియంత్రణే ప్రధాన లక్ష్యం*
వై.ఎస్.ఆర్. కడప జిల్లావ్యాప్తంగా రోడ్డు భద్రతపై పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
కడప, డిసెంబర్ 27:
కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్, ఐపీఎస్ గారి ఆదేశాలు, జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు వై.ఎస్.ఆర్. కడప జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లావ్యాప్తంగా రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధుల్లో ఈ కార్యక్రమాలు చేపట్టి, వాహనదారులు, ప్రజలకు రోడ్డు భద్రతా నిబంధనలపై సమగ్ర అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ, రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాల రక్షణే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
వాహనదారులకు ముఖ్య సూచనలు:
*👉 మైనర్ల డ్రైవింగ్ నిషేధం:*
మైనర్లకు వాహనాలు అప్పగించరాదని, అలా చేస్తే సంబంధిత తల్లిదండ్రులు, వాహన యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
*👉 హెల్మెట్ తప్పనిసరి:*
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇది ప్రాణాలను కాపాడే కీలక రక్షణ సాధనమని వివరించారు.
*👉 అతివేగం, అతిలోడ్ వద్దు:*
అతివేగం, అతిలోడ్‌తో వాహనాలు నడపడం ప్రాణాంతకమని, ఇవే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు.
*👉 డ్రంకెన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు:*
మద్యం సేవించి వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమని, డ్రంకెన్ డ్రైవ్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణాలు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
జిల్లా పోలీస్ కార్యాలయం,
వై.ఎస్.ఆర్. కడప జిల్లా