logo

నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ – కడప హాస్టల్ బ్రాంచ్‌లో ఈ-చాంప్స్ విభాగం జిల్లా స్థాయి క్రీడా మహోత్సవం విజయవంతంగా ముగిశాయి.

నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ – కడప హాస్టల్ బ్రాంచ్‌లో ఈ-చాంప్స్ విభాగం జిల్లా స్థాయి క్రీడా మహోత్సవం విజయవంతంగా ముగిశాయి.


కడప మేజర్ న్యూస్ 27

నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో, కడప హాస్టల్ క్యాంపస్‌లో శనివారం నిర్వహించిన ఈ-చాంప్స్ విభాగం జిల్లా స్థాయి క్రీడా మహోత్సవం అత్యంత ఘనంగా, శోభాయమానంగా, విజయవంతంగా ముగిసింది.గత నెలలో హై స్కూల్ విభాగానికి సంబంధించిన క్రీడా పోటీలు విజయవంతంగా పూర్తికాగా, ఈ-చాంప్స్ విభాగం ఆధ్వర్యంలో 4వ, 5వ తరగతుల విద్యార్థులకు సంబంధించిన క్రీడా పోటీలు మొత్తం 12 శాఖల నుండి ఎంపికైన విద్యార్థులతో నిర్వహించబడ్డాయి.
గత వారం రోజులుగా గ్రూప్‌కు చెందిన అన్ని శాఖలలో నిర్వహించిన క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఫైనల్ రౌండ్‌లో ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని చాటుకున్నారు.
12 శాఖల నుండి పాల్గొన్న విద్యార్థులు తమ క్రమశిక్షణ, పోటీ స్ఫూర్తి, జట్టు భావంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విద్యార్థుల్లో శారీరక దారుఢ్యం, నాయకత్వ గుణాలు, సమిష్టి బాధ్యత భావన పెంపొందించడంలో ఈ క్రీడా మహోత్సవం ఒక ప్రేరణాత్మక వేదికగా నిలిచింది.ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి కడప మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) శ్రీమతి బి. రమాదేవి, ముఖ్య అతిథిగా, అలాగే ఆర్ డీ ఈ-చాంప్స్ విభాగం అతిథిగా శ్రీమతి భారతి, అదనంగా జిల్లా స్థాయి ఏజీఎంలు, క్లస్టర్ ప్రిన్సిపల్స్, ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, ఈ-చాంప్స్ జోనల్ కోఆర్డినేటర్లు, స్పోర్ట్స్ ఏఆర్‌పి విఘ్నేష్, అకడమిక్ ఆఫీసర్లు హాజరై విద్యార్థులను ఉత్సాహపరిచారు. వారి హాజరు క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, మరింత ప్రేరణను కలిగించింది.
ఫైనల్స్‌లో పాల్గొన్న క్రీడాకారులందరికీ నారాయణ గ్రూప్ మేనేజ్‌మెంట్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయులు, నిర్వాహకులు మరియు సహకరించిన సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తల్లిదండ్రులు, సంరక్షకులు క్రీడాభిమానులు అందించిన సహకారం ప్రశంసనీయమని పేర్కొంది. ఈ-చాంప్స్ విభాగం జిల్లా స్థాయి క్రీడా మహోత్సవం విజయవంతంగా పూర్తయ్యింది. యువ క్రీడాకారులు తమ అసాధారణ ప్రతిభతో మెరిసి, భవిష్యత్ విజయాలకు పునాది వేసిన ఈ కార్యక్రమం నారాయణ గ్రూప్ చరిత్రలో ఒక స్మరణీయ ఘట్టంగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.

7
604 views