
మదన్ డిజిటల్స్ ఎంతోమందికి ఉపాధి
మదన్ డిజిటల్స్ ఎంతోమందికి ఉపాధి
కడప జిల్లా ఫ్లెక్సీ ప్రింటింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె. మదన్మోహన్ రెడ్డి
కడప డిసెంబర్ 27
యువతకు ఎంతో ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో డిజిటల్ బ్రాంచ్ ని కడప జిల్లా ఫ్లెక్సీ ప్రింటింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అధినేత కె మదన్మోహన్ రెడ్డి, శ్రీమతి గౌరీ లు పూజా కార్యక్రమాలతో కడప నగరం ఆర్టిసి బస్టాండ్ సమీపం తేజ పెట్రోల్ బంక్ దగ్గర్లో శివరాం బిర్యానీ వీధి, రామాలయం రోడ్డులో శనివారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి నగరంలోని పలువురు ముఖ్య నేత నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మదన్ డిజిటల్స్ అధినేత, కడప జిల్లా ఫ్లెక్సీ ప్రింటింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కే మదన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2018లో మదన్ డిజిటల్స్ కడపలో ప్రారంభించామని తెలిపారు. అప్పటినుండి నేటి వరకు మా డిజిటల్స్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. కడప నగరం ఎంతో విస్తరించినందున ప్రజల సౌకర్యార్థం మదన్ డిజి టల్స్ బ్రాంచ్ ను శివరాం దమ్ బిర్యాని పక్కన అరవింద నగర్ రామాలయంలో వీధిలో అత్యాధునిక టెక్నాలజీతో నూతన మిషనరీతో ప్రారంభించడం జరిగిందన్నారు. కడపలోని రెండు బ్రాంచ్ ల ద్వారా 20 మందికి ఉద్యోగ అవకాశాలు దాదాపు 100 నుంచి 200 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఫ్లెక్సీ ప్రింటింగ్ ఏకో సాల్వెంట్ ప్రింటింగ్, యు వి ప్రింటింగ్, గ్లో షైన్ బోర్డ్స్, పివిసి కా కాన్వాస్ ప్రింటింగ్, స్టార్ ఫ్లెక్సీ ప్రింటింగ్ ,బ్యాక్ లైట్ ప్రింటింగ్, స్టిక్కర్స్, మెస్ ప్రింటింగ్, లామినేషన్, హైవే రేడియం ప్రింటింగ్ ఏసీపి బోర్డ్స్, కలర్ జిరాక్స్, లెటర్ ప్యాడ్స్ వెయిటింగ్ కార్డ్స్ తదితర సౌకర్యం కలదన్నారు. ఈ అవకాశాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలనీ తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు నగర ముఖ్య నేతలతో పాటు మిత్రులు శ్రేయోభిలాషులు ఫోటో స్టూడియో,ఫోటోగ్రాఫర్స్ హాజరయ్యారు.