logo

ఏళ్ల తరబడి ఉన్న వివాదానికి శుభం కార్డు! 🤝

ఏళ్ల తరబడి ఉన్న వివాదానికి శుభం కార్డు! 🤝

పెద్ద దర్గా ఉరుసు పూర్తయిన వెంటనే సమస్యను పరిష్కరిస్తానని గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి గారు నేడు కీలక ఘట్టానికి నాంది పలికారు.

గత రెండేళ్లుగా కడప పెద్ద దర్గా సజ్జదే నషీన్, ముతువల్లి శ్రీ ఆరిఫుల్లాహ్ హుస్సేని గారికి మరియు రాష్ట్ర ముతువల్లిల సంఘం అధ్యక్షులు శ్రీ కె.ఎం. షకీల్ షఫీ గారికి మధ్య తార స్థాయి లో నెలకొన్న వివాదాలకు నేడు హైదరాబాద్ లోని శ్రీనివాసరెడ్డి గారి కార్యాలయం నందు శాశ్వత పరిష్కారం లభించింది.

శ్రీనివాసరెడ్డి గారి చొరవతో, ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరింది. ఈ రాజీ ప్రయత్నంలో కడప పట్టణ టీడీపీ అధ్యక్షులు శ్రీ పి. మన్సూర్ అలీ ఖాన్ గారు, పెనుగొండ హజరత్ బాబా ఫక్రుద్దీన్ దర్గా సజ్జదే నషీన్ శ్రీ తాజ్ బాబా గారు, కదిరి కుటాగుల దర్గా పీఠాధిపతి శ్రీ ఊబేదుల్లా గారు కీలక పాత్ర పోషించారు.

పెద్దల సమక్షంలో, శ్రీనివాసరెడ్డి గారి మధ్యవర్తిత్వంతో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అందరూ కలిసిమెలిసి ఉండాలని, దర్గా అభివృద్ధికి సహకరించుకోవాలని నిర్ణయించుకోవడం శుభపరిణామం.

సమస్య ఏదైనా సామరస్యపూర్వకంగా పరిష్కరించడంలో శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడూ ముందుంటారని మరోసారి నిరూపితమైంది.

0
154 views