logo

భారత సేవా సమితి ఆధ్వర్యంలో మతిస్థిమితం లేని వ్యక్తి నేడు స్వగ్రామానికి. (చంద్ర న్యూస్:-నిజామాబాద్ జిల్లా, ప్రతినిధి డిసెంబర్ 27)




దుబాయ్: గల్ఫ్ కార్మికుడు,
గత నెల రోజుల క్రితం దుబాయ్ వచ్చిన తోకల మారుతి స్వగ్రామం గుడారం నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ మండలం ప్రాంతానికి చెందిన తోకల మారుతి (51) గత నెల రోజుల క్రితము దుబాయి వచ్చి కంపెనీ లో పనిచేస్తు మతిస్థిమితం కోల్పోవడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న ఇంటికి వెళ్లడం జరిగింది. దానికి సామాజిక సేవకులు సహాయ సహకారాలు అందించారు. కంపెనీ దాదాపు (25,000,AED) భరించి మన కరెన్సీ రూపంలో ఒక పది లక్షల వరకు ఖర్చు కంపెనీ భరించి చివరికి అతనికి ఇంటికి టిక్కెట్ ఇద్దరికి, హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస్ ను.. మనిషిని తోడు ఇచ్చి పంపించడం జరిగింది. సామాజిక కార్యకర్తల సహాయతతో కంపెనీతో సంప్రదింపులు చేసి తొందరగా తోకల మారుతిని ఇంటికి పంపడం జరిగింది. 25 రోజులు కోమా మతిస్థిమితం కోల్పోయి హాస్పిటల్లో గడిపిన మారుతి ఎట్టకులకు ఇంటికి చేరుకున్నారు. బొమ్మ ప్రవీణ్, జంగం బాలకిషన్,,రమేష్ పవర్, రవి .. కార్యకర్తలు భారత సేవా సమితి ఆధ్వర్యంలో దగ్గరుండి పంపించారు. కుటుంబ సభ్యులు ఏర్పోర్టు కు వచ్చి తొలుక పోయరు, (బాసేసకి) కృతజ్ఞతలు తెలిపినారు...

31
13736 views