మనిషికి మరణించినా కరువైన గౌరవం: చెత్త రిక్షాపై వృద్ధురాలి శవం.. మన్యం జిల్లాలో విషాద దృశ్యం!
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురంలో అమాయవీయ ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న గ్రామానికి చెందిన రాధ అనే వృద్ధురాలికి ఎవరూ లేకపోవడంతో చుట్టుపక్కల వారే భద్రగిరి సామాజిక ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు.
అంబులెన్స్, తీసుకెళ్లే సౌంతవాళ్లు లేక మృతదేహాన్ని ఇరుగుపొరుగువారే చెత్త రిక్షాపై తరలించడం చూపరులను కలచివేసింది.