logo

మాజీ Addl SP ఉమామహేశ్వర రావు మృతి


జర్నలిస్ట్ : మాకోటి మహేష్
పోలీస్ శాఖ లో ఉమ్మడి ఖమ్మం జిల్లా లో వివిధ హోదాల్లో పని చేసి ఆంధ్రప్రదేశ్ లో ఎడిషనల్ ఎస్పీ గా రిటైర్ అయిన ఉప్పలపాటి ఉమా మహేశ్వర రావు గురువారం ఆసుపత్రి లో చికిత్స పొందుతు మృతి చెందారు. ఆయన గతం లో ఏన్కూర్ లో ఖమ్మం ట్రాఫిక్ లో ఎస్సైగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్ టి పీసీ కోరుట్ల లలో ఎస్సైగా కొంతకాలం చింతూరు, పాల్వంచ లో సీఐ గా పని చేశారు 610జి వో లో ఆంధ్రప్రదేశ్ కు బదిలీ అయ్యారు. డిఎస్పీగా పనిచేస్తూ ఇక్కడే ఎడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యారు. కిడ్నీ సంబంధతావ్యాధి తో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ విజయవాడ లో గురువారం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

1
24 views