logo

రక్తసిక్తమైన రాయపూర్ హైవే: వేగంగా దూసుకొచ్చిన వాహనం.. 35 మూగజీవాలు మృతి!


విజయనగరం మండలం గ్రామ రెవెన్యూ పరిధిలో రాయపూర్ హైవేపై జరిగిన ప్రమాదంలో 35 గొర్రెలు మృతి చెందగా 15 గొర్రెలు తీవ్ర గాయాల గురయ్యాయి తెల్లవారుజామున 5 గంటల సమయంలో గొర్రెల కాపరి సిరిపురం గ్రామానికి చెందిన కర్రీ సింహాద్రి పొట్టేలు కృష్ణ కు చెందిన గొర్రెలు సంఘటన విషయం తెలుసుకున్న రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులకు భరోసా కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘటన చాలా బాధాకరమని సంక్రాంతి సమయంలో ఎటువంటి సంఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు సుమారు 5 లక్షల పైబడి నష్టం జరిగిందన్నారు ఈ విషయాలను యాదవ్ కార్పొరేషన్ లో పెట్టి న్యాయం జరిగే విధంగా చూస్తానన్నారు అలాగే ఇప్పటికే జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు ఎమ్మెల్యే అతిథి గజపతిరాజుకు తెలియజేశామని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరేం అన్నారు సంఘటన స్థలంలో పశు వైద్యాధికారి శృతి పంచనామా నిర్వహిస్తున్నారు . విజయనగరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు

35
1593 views