logo

విమర్శకుల ప్రశంసలు అందుకున్న స్వరబృందావనం 28 వ సంగీత విభావరి 25.12.2025

హైదరాబాద్ : డిసెంబర్ 25 న కళాభారతి city cultural center, rtc cross roads, hyd లో కొత్త పాటల కలయికతో, ఉద్ధండులు అయిన గాయని గాయకులతో, మధుర గాన పరిమళాలు వెదజల్లి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది మన స్వరాబృందావనం 28 వ సంగీత విభావరి. సంవత్సర కాలం లోనే ఇంత కీర్తి ప్రతిష్టలు రావడం, google లో SWARABRUNDAVANAM అని టైపు చేయగానే గడచిన ప్రోగ్రామ్స్ అన్ని రావడం అంటే మాటలు కాదు. గాయని గాయకుల ప్రతిభ ఒకటి అయితే, చిన్న ప్రోగ్రామ్ అయిన పెద్ద ప్రోగ్రామ్ అయిన ఒక పెద్ద ప్రాజెక్ట్ ల తీసుకుని, అత్యద్భుతం గా తీర్చి దిద్దడం స్వరాబృందావనం నిర్వాహకుల ప్రతిభ కి నిదర్శనం.
స్వరబృందావనం సంస్థ వ్యవస్థాపకులు, నిర్వాహకులు, గాయకులు మరియు anchor అయిన శ్రీ బృందావనం రవికాంత్ గారు మరియు గాయకులు, సహానిర్వాహకులు అయిన శ్రీ తూములూరి శ్రీకుమార్ గారు నిన్న మీడియా తో మాట్లాడుతూ... ఎప్పుడు లాగే ప్రముఖ గాయని గాయకులు అయిన శ్రీ విజయరాఘవన్, శ్రీ శరత్ కృష్ణ, శ్రీ అనంత్, శ్రీ గోవిందా శాస్త్రి, శ్రీ కోచెర్ల రఘుబాబు, శ్రీ విజయ్ భరత్, శ్రీ వెంకట ప్రసాద్, శ్రీ రాజకుమార్, శ్రీమతి రమాదేవి, శ్రీమతి లత, శ్రీమతి దాము రాజేశ్వరి, శ్రీమతి సీతాకుమారి, శ్రీమతి శారద, శ్రీమతి రవిలక్ష్మి, శ్రీమతి యశోద, శ్రీమతి నిర్మల, శ్రీమతి సుజాత తదితరులు అద్భుతమైన గానం తో అలరించారాని తెలిపారు.
స్వరబృందావనం నిర్వాహకులు, వ్యవస్థాపకులు, గాయకులు మరియు anchor అయిన శ్రీ బృందావనం రవికాంత్ గారు మాట్లాడుతూ..... ఈ కార్యక్రమం లో ధనుర్మాసం సందర్బంగా డా. దాము రాజేశ్వరి గారు, సంస్థ మీద అభిమానం తో గాయని గాయకులకు ఎంతో విలువైన "భగవత్ గీత " అందజేశారు అని, వారికీ ఎంతో కృతజ్ఞతలు తెలిపారు.
ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లలో అనేక పట్టణాల్లో స్వరాబృందావనం కార్యక్రమాలు నిర్వహించమని, వివిధ ప్రేక్షకులు కోరుచున్నారు. త్వరలో వారి కోరిక నెరవేర్చగలమని ఆశిస్తున్నాము అని, ఇప్పటికే హైదరాబాద్ లోనే కాకుండా the city of destiny విశాఖపట్నం లో కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.

49
2836 views