
జగిత్యాల డిఎంహెచ్ఓ గుండె పోటుతో ఆకస్మిక మృతి
వైద్య వర్గాల్లో తీవ్ర విషాదం
జగిత్యాల డిఎంహెచ్ఓ గుండె పోటుతో ఆకస్మిక మృతి
వైద్య వర్గాల్లో తీవ్ర విషాదం
జగిత్యాల, డిసెంబర్
27 :
జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ)గా ఈ నెల 18 నుండి సేవలందిస్తూ, ఎస్ కే ఎన్ ఆర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యుడిగా ఉన్న డాక్టర్ ఆకుల శ్రీనివాస్ శనివారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందడం జిల్లావ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. శనివారం ఉదయం ఆయన హఠాత్తుగా నిద్రలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, సహచరులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ వార్త వెలువడగానే ఎస్ కే ఎన్ ఆర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, తమ సహచరుడి అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు.
అలాగే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రజారోగ్య రంగంలో అంకితభావంతో పనిచేస్తూ, బాధ్యతాయుత అధికారిగా మంచి గుర్తింపు పొందిన ఆకుల శ్రీనివాస్ మరణం వైద్య శాఖకు తీరని లోటుగా వారు పేర్కొన్నారు. శనివారం ఉదయం ఈ విషాద వార్త వెలువడగానే కలెక్టరేట్ సిబ్బంది, వైద్య విభాగ సహచరులు, మిత్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. శోక సముద్రంలో కుటుంబ సభ్యులు....