logo

నర్సీపట్నం పీవీఆర్ క్యాంటీన్‌పై ఫుడ్ సేఫ్టీ దాడి

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం: పౌర ఫిర్యాదు మేరకు అనకాపల్లి జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బి.రవి కుమార్ నేతృత్వంలో బృందం నర్సీపట్నంలోని పీవీఆర్ శ్రీ కన్యా థియేటర్ క్యాంటీన్‌పై తనిఖీ నిర్వహించింది .పీజీఆర్‌ఎస్‌లో 22న అందిన ఫిర్యాదుపై మరుసటి రోజు 23న ఫిర్యాదుదారుతో కలిసి క్యాంటీన్‌ను పరిశీలించారు. ఆహార కల్తీ అనుమానంతో ఐస్ క్యూబ్స్ నీటి (కోడ్: 016/Akp/DII/52964/2025-25), పిజ్జా (కోడ్: 016/Akp/DII/52565/2025-26) నమూనాలు సేకరించి హైదరాబాద్ నాచారం స్టేట్ ఫుడ్ ల్యాబ్‌కు పంపారు .తనిఖీ నివేదిక, పత్రాలు, ఫోటోలతో విశాఖపట్నం జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్‌కు లేఖ రాశారు. పీజీఆర్‌ఎస్ ఫిర్యాదిని మూసివేయాలని కోరారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు

6
436 views