logo

సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు, ఎంపీ మరియు కలెక్టర్.

గోస్పాడు (AIMA MEDIA): నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలం యాళ్ళూరు గ్రామ ప్రజల దశాబ్దాల కల నెరవేరిందని. గ్రామంలో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) ను రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి రావడం వల్ల యాళ్ళూరు మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు స్థానికంగానే లభిస్తాయని మంత్రులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ గతంలో వైద్యం కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించి పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇకపై ఆ అవసరం లేకుండా యాళ్ళూరులోనే అన్ని రకాల ప్రాథమిక చికిత్సలు అందుతాయని తెలిపారు. ఈ కేంద్రంలో సరిపడా డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందితో పాటు అవసరమైన మందులను నిరంతరం అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ప్రతి సామాన్యుడికి ఉచితంగా, నాణ్యమైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఆశయమని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని మరిన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని చెప్పారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల కనికరంతో వ్యవహరించాలని, అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా ఉండి ప్రాణాపాయం తప్పించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి , యాళ్ళూరు గంగుల వెంకట రెడ్డి, మంచాల విష్ణు వర్ధన్ రెడ్డి, గంగుల సుధాకర్ రెడ్డి, బత్తుల జగదీశ్ రెడ్డి, తిరుమలేష్ రెడ్డి, నన్నూరి రమణ, సర్పంచ్, బషీర్ , గోస్పాడు మండల కన్వీనర్ తులసిశ్వర్ రెడ్డి , శీలం భాస్కర్ రెడ్డి, చిల్లంకూరు శ్రీనివాస రెడ్డి, ద్వారం వీరా రెడ్డి, ఫరూక్ హుస్సేన్, దూదేకుల మనోజ్, సదాశివా రెడ్డి, అసముద్దీన్, చంద్రశేఖర్ రెడ్డి, బాలిశ్వర్ రెడ్డి, ఆళ్లగడ్డ పుండరికాక్షా రెడ్డి, ముక్కమల్ల వీరేంద్ర సింహ రెడ్డి, జూలేపల్లె మనోహర్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, శ్రీనివాసపురం గోపాలకృష్ణ, వెంకటేశ్వరావు, శివాజీ, బీవీ నగర్ సుబ్బయ్య, ఆలపాటి శ్రీనివాసులు, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాస్, దీపక్ రెడ్డి , మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసి రెడ్డి , మిద్దె హుసేని, కామిని మల్లికార్జున, గోపి, స్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

8
369 views