
ఆముదాలవలసలో ప్రజాధర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే కూన రవికుమార్
AIMA న్యూస్ శ్రీకాకుళం :
👉ఆముదాలవలస నియోజకవర్గంలో ఆముదాలవలస పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ గారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలు, వినతులను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు.
👉ప్రజల నుండి వచ్చిన పలు వినతులను శ్రద్ధగా ఆలకించిన ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు, సమస్యల స్వరూపాన్ని తెలుసుకొని సంబంధిత శాఖల అధికారులను వెంటనే స్పందించి తక్షణ పరిష్కారం చూపాలని ఆదేశించారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, విద్యుత్, పింఛన్లు, గృహ నిర్మాణం వంటి ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు.
👉ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజా దర్బార్ ద్వారా నేరుగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. ప్రతి వినతిపై బాధ్యతాయుతంగా చర్యలు తీసుకొని, ప్రజలకు న్యాయం జరిగేలా అధికార యంత్రాంగం పనిచేయాలని స్పష్టం చేశారు.
👉 ఈ సందర్భంగా బూర్జ ,సరుబుజ్జిలి, ఆముదాలవలస మండలాలకు చెందిన అంగనవాడి కార్యకర్తలకు 5జి మొబైల్స్ ను పంపిణీ చేయడం జరిగింది.
👉ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.