logo

ఎరువులు మరియు పురుగుమందుల దుకాణాలను తనిఖీ చేసిన మండల వ్యవసాయ అధికారి.

మహానంది (AIMA MEDIA): మహానంది మండలం బుక్కాపురం గ్రామంలోని ఎరువులు మరియు పురుగుమందుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరెడ్డి.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ మండలంలోని ఎరువులు మరియు పురుగు మందుల దుకాణాల డీలర్లు యూరియా ఎరువును అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. యూరియా నిలువల సమాచారానికి సంబంధించిన ఫ్లెక్సీ బోర్డులను దుకాణం ముందు ప్రతిరోజు ఉంచాలని,స్టాక్ బోర్డులో యూరియా మరియు ఇతర ఎరువుల వివరాలను ఎప్పటికప్పుడు పొందుపరచాలని, రైతులకు బిల్లులు ఇవ్వాలని తెలిపారు. ఎరువుల అమ్మకపు వివరాలను ఎప్పటికప్పుడు ఈపాస్ మిషన్ లో అప్డేట్ చేయాలని, అనుమతులు ఉన్న ఎరువులు మరియు పురుగుమందులను మాత్రమే అమ్మాలని ఆదేశించారు..

9
511 views